Natyam ad

పుంగనూరులో రోడ్డు భద్రతలు పాటించాలి

పుంగనూరు ముచ్చట్లు:

వాహనాల్లో ప్రయాణించే వారు రోడ్డు భద్రత పాటించి, ప్రమాదాల నివారణకు సహకరించాలని ఏఎంవిఐ సుప్రియ కోరారు. శుక్రవారం స్థానిక ప్రైవేటు కళాశాలలో రోడ్డు ప్రమాదాల నివారణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరు డ్రైవింగ్‌ లైసెన్సులు పొందాలని , ద్విచక్రవాహనదారులు హెల్మెట్లు ధరించి వాహనాలను నడపాలన్నారు. అతివేగంగా నడపడం, సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ , మధ్యం సేవించి వాహనాలు నడిపితే వాహనం నడిపేవారితో పాటు యజమానులపై కేసులు నమోదు చేస్తామని తెలిపారు. రోడ్డు ప్రమాదాల్లో అమాయకులు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై ప్రతి ఒక్కరు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు.

Post Midle

 

Tags: Road safety should be observed in Punganur

Post Midle

Leave A Reply

Your email address will not be published.