-జిల్లా కలెక్టర్ గోగులోత్ రవి
Date:18/01/2021
జగిత్యాల ముచ్చట్లు:
: ప్రతి పౌరుడు రోడ్డు భద్రత ప్రమాణాలను పాటించాలని జిల్లా కలెక్టర్ గోగులోత్.రవి తెలిపారు. జనవరి 18 నుండి ఫిబ్రవరి 17 వరకు జరిగే జాతీయ 32వ రహదారి భద్రతా మాసోత్సవాల ప్రారంభం సందర్భంగా సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో పోస్టర్స్, స్టిక్కర్లు, గోడప్రతులను ఆవిష్కరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచంలో ప్రతి సంవత్సరం జరిగే మరణాలలో 40 శాతం రోడ్డు ప్రమాదాల కారణంగానే జరుగుతున్నాయని, వీటి ద్వారా మనం మన ఆత్మీయులను కోల్పోతున్నామన్నారు.దేశంలో వాహనాల సంఖ్య రోజురోజుకు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో ప్రమాదాలు పెరుగుతున్నాయని, వీటిని వీలైనంత నిర్మూలించడానికి, ప్రజలకు రహదారులపై జరిగే ప్రమాదాలు, వాటి నిర్మూలనపై అవగాహన కల్పించడానికి జాతీయ భద్రతా మాసోత్సవాలను జనవరి 18 నుండి ఫిబ్రవరి17 వరకు నిర్వహించడం జరిగిందని తెలిపారు. దేశంలో ద్వీచక్ర వాహనాదారులందరు హెల్మెట్ తప్పకుండా ధరించాలని, ప్రమాద సమయంలో ఇవి మన ప్రాణాలను కాపాడతాయని కలెక్టర్ తెలిపారు.
హెల్మెట్ ధరించకపోవడం వల్ల ఎంతో మంది ప్రమాదాలలో తమ ప్రాణాలు కోల్పోయి తమ కుటుంబాలకు తీరని భాద మిగిలిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. ట్రాఫిక్ రూల్స్ పాటించటం ద్వారా చాలా ప్రమాదాలను అరికట్టవచ్చని, ట్రాఫిక్ నియమాల గురించి తెలిసిన వారు ఇతరులకు అవగాహన కల్పించాలని, అందరు ట్రాఫిక్ నిభందనలు పాటించాలని జిల్లా కలెక్టర్ కోరారు. ఈ కార్యక్రమంలో లో జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి శ్యామ్ ఆజ్మీరా నాయక్, ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
ఆర్టీసీ బస్ డిపో లో…
32 వ జాతీయ రోడ్డు భద్రత వారోత్సవాల సందర్భంగా జగిత్యాల ఆర్టీసీ బస్ డిపో లో ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రూరల్ సిఐ కృష్ణ కుమార్, డివిజనల్ మేనేజర్ ఎస్ నాగేశ్వరరావు పాల్గొన్నారు మెకానిక్ సిబ్బంది మంచి కండిషన్ కలిగిన వాహనాన్నే ఇవ్వాలని సూచించారు. డ్రైవర్లు ఎలాంటి మానసిక ఆందోళన లేకుండా బస్సు నడపాలని మొబైల్ మాట్లాడుతూ డ్రైవింగ్ ఏ పరిస్థితుల్లో చేయవద్దని, మద్యం సేవించి బస్సు అసలే నడుప వద్దని పోలీస్ ఇన్స్పెక్టర్ కృష్ణ కుమార్ సూచించారు. డివియం నాగేశ్వరరావు, డియం జగదీశ్వర్ తదితరులు మాట్లాడారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo
Tags:Road safety standards must be followed