Date:27/11/2020
ఏలూరు ముచ్చట్లు
ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రహదారి భద్రత ప్రమాణాలు పాటించాలని ఏలూరు ట్రాఫిక్ పోలీసులు సూచించారు. ఈ మేరకు శుక్రవారం నాడు ఏలూరు జ్యూట్ మిల్లు సెంటర్ వద్ద ట్రాఫిక్ అవగహన కార్యక్రమాన్ని నిర్వహించారు. హెల్మెట్ , సీట్ బెల్ట్, మాస్కు లు , వాహన రిజిస్ట్రేషన్ పత్రాలు లేని వాహన దారులకు,.సెల్ ఫోను మాట్లాడుతూ వాహనం నపడటం లాంటి పలు అంశాలం పై కౌన్సిలింగ్ ఇచ్చారు.
రోడ్డు పై ప్రయాణం చేసే సమయంలో ట్రాఫిక్ నిబంధనలు తూచా తప్పకుండా పాటించటంతో పాటు వారి కుటుంబ సభ్యుల భవిష్యత్తు ను దృష్టిలో పెట్టుకోవాలన్నారు. రోడ్డు ప్రమాదాలలో అనేకమంది ఆశువులు బాస్తున్నరు. వారి కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్న విషయాలను గమనించాలని అన్నారు.
ట్రాఫిక్ నియమ నిబంధనలు అతిక్రమించి ఒకటి రెండు సార్లు దొరికితే అపరాధ రుసం విధిస్తామని, పదే పదే వాహన తనిఖీలతో పట్టుబడితే వాహనం సీజ్ చేస్తామని హెచ్చరించారు. నిబంధనలను అతిక్రమించిన వాహనచోదకులు పై జరిమానాలు విధించారు.
Tags:Road safety standards must be followed