Natyam ad

పాపిశెట్టిపల్లెకు రూ:79 లక్షలతో రోడ్డు పనులు ప్రారంభం

– మంత్రి పెద్దిరెడ్డికు రుణపడి ఉంటాం
– పల్లెబాటలో ప్రజల వినతులపై వెంటనే స్పందన
– పనులను ప్రారంభించిన ఎంపీపీ, జెడ్పిటీసీ
 
చౌడేపల్లె ముచ్చట్లు:
 
మండలంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీ పాపిశెట్టిపల్లె గ్రామానికి తారు రోడ్డు ఏర్పాటుకు రూ:79 లక్షలు నిధులు మంజూరైయ్యాయని ఎంపీపీరామమూర్తి, జెడ్పిటీసీ దామోదరరాజు తెలిపారు. ఆదివారం విజయవాణి స్కూల్‌ నుంచి పాపిశెట్టిపల్లె వరకు తారు రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ ఇటీవల మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పల్లెబాట పర్యటనలో ప్రజలతోపాటు జెడ్పిటీసీ దామోదరరాజు విజ్ఞప్తి మేరకు మంత్రి స్పందించి వెంటనే ఈఏపి గ్రాంట్‌ ద్వారా నిధులు మంజూరుచేయించారన్నారు. కొన్నేళ్లుగా రోడ్డు సదుపాయం సక్రమంగా లేక అవస్థలు పడుతున్న తమ గ్రామానికి సుమారు 2 కిలోమీటర్ల మేరకు తారు రోడ్డు సౌకర్యం మంజూరు చేయించిన మంత్రి పెద్దిరెడ్డికు జీవితాంతం రుణపడి ఉంటామని గ్రామస్తులు తెలిపారు. త్వరగా పనులు పూర్తిచేసేలా చర్యలు తీసుకొంటామని పిఎల్‌ఆర్‌ మేనేజర్‌ అనంతరెడ్డి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలొ సర్పంచ్‌ అనూరాధ, నాయకులు బాబు, తదితరులున్నారు.
పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Road works to Papishettipalle start at a cost of Rs 79 lakh