రోడ్డెక్కెన రైతులు..దిగొచ్చిన అధికారులు
రాజానగరం ముచ్చట్లు:
తూర్పుగోదావరి జిల్లా రాజనగరం నియోజకవర్గం కోరుకొండలో మెయిన్ రోడ్డుపై రైతులు ఆందోళనకు దిగారు. రైతుల పండించిన ధాన్యాన్ని ఇటు సచివాలయ సిబ్బంది ,అటు రైస్ మిల్లర్లు ఏదో సాకుతో ఇబ్బందులకు గురి చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసారు. జనసేన రాజానగరం నాయకులు బత్తుల బలరామకృష్ణ మద్దతు తెలపడంతో జనసైనికులు రోడ్డుమీద బైఠాయించారు. రైతుల జీవితాలతో ప్రభుత్వం ఆడుకోవడం ఎంతవరకు కరెక్ట్ ప్రభుత్వ పనితీరు రోడ్డుమీద పరిస్థితి నెలకొంది అంటూ ప్రభుత్వంపై బత్తుల బలరామకృష్ణ మండిపడ్డారు. రైతుల ఆందోళనతో అధికారులు దిగొచ్చారు. అందోళన నేపధ్యంలో ట్రాఫిక్ సుమారు గంటపాటు నిలిచిపోయింది. చివరకు ధికారుల హామీతో రైతులు ఆందోళన విరమించారు.
Tags: Roadblocked farmers..Officials

