బస్సు కోసం రోడ్డేక్కిన విద్యార్థులు

Roading students for the bus

Roading students for the bus

Date:19/07/2018

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపం యాతలవంక వద్ద బస్సులు ఆపడం లేదని విద్యార్థులు గురువారం జాతీయ రహదారిపై బైఠాయించి, నిరసన తెలిపారు. మండలంలోని ఈడిగపల్లె, బోడేవారిపల్లె, యాతాలవంక, పట్రపల్లి తదితర ప్రాంతాల నుంచి సుమారు వంద మంది విద్యార్థులు పుంగనూరు, మదనపల్లె పాఠశాలలకు, కళాశాలలకు వెళ్తుంటారు. ఇలా ఉండగా కళాశాలల వేళల్లో బస్సులు ఆపకుండ వెళ్లిపోవడంతో విద్యార్థులు ప్రతి రోజు స్కూల్‌కు వెళ్లలేకపోవడం జరుగుతోంది. విద్యార్థులకు ప్రభుత్వం ఇచ్చిన పాసులతో ఆదాయం రాదని, బస్సులు ఆపడం లేదని విద్యార్థులు ఆరోపించారు. ఇందుకు నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి ధర్నా చేశారు. సీఐ సాయినాథ్‌ ఆధ్వర్యంలో పోలీసులు విద్యార్థులతో చర్చలు జరిపి, డిపో మేనేజర్లతో ఫోన్‌లో మాట్లాడి, బస్సులను ఆపే విధంగా చర్యలు తీసుకుంటామని హామి ఇవ్వడంతో ధర్నా విరమించారు.

బస్సు కోసం రోడ్డేక్కిన విద్యార్థులుhttps://www.telugumuchatlu.com/roading-students-for-the-bus/

Tags: Roading students for the bus

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *