కంటోన్మెంట్ ఏరియాలో గఫ్ రోడ్ కు ప్రత్యామ్నాయంగా రోడ్లు

– ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి
Date:19/05/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఏఓసి కంటోన్మెంట్ ఏరియాలో గఫ్ రోడ్ కు ప్రత్యామ్నాయంగా రోడ్లు, ఫ్లైఓవర్ నిర్మాణాలపై అధికారులు రూపొందించిన పలు ప్రత్యామ్నాయాల పై చర్చించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.ఎస్.కె.జోషి తెలిపారు.శనివారం సచివాలయంలో గఫ్ రోడ్, ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, మిలటరీ భూసమస్యలపై సమీక్షా సమావేశం జరిగింది. ఏఓసి కి సంబంధించి  అధికారుల కమిటీ ప్రజలకు, మిలటరీకి ఉపయోగపడేలా గ్రేడ్ రోడ్లు,ఎలివేటేడ్ కారిడర్ లు నిర్మించేలా ఐదు ప్రతిపాదనలు రూపొందించారని సి.యస్ తెలిపారు. ఈ ప్రతిపాదనలకు అయ్యే వ్యయం, భూసేకరణ తదితర అంశాలపై చర్చించారు. మిలిటరి సెక్యూరిటీకి సంబంధించి లెన్సింగ్, వాచ్ టవర్స్ శిక్షణ, మెడికల్ ఫెసిలిటీలకు అవసరమైన ఇన్ ఫ్రాస్ట్రక్చర్లపై నివేధిక కోరారు. జవహర్ నగర్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్, శామీర్ పేట డిఫెన్స్ భూములుపై చర్చించారు. ఈ సమావేశంలో తెలంగాణ,ఆంధ్ర సబ్ ఏరియా, జనరల్ ఆఫీసర్ కమాండింగ్ మేజర్ జనరల్ ఎన్ శ్రీనివాస రావు,  ఆర్ అండ్ బి శాఖ ముఖ్యకార్యదర్శి సునీల్ శర్మ, జి.హెచ్.ఎం.సి కమీషనర్ జనార్ధన్ రెడ్డి కంటోన్మెంట్ బోర్డ్ సిఈఓ యస్ వి.ఆర్ చంద్రశేఖర్, బ్రిగేడియర్ యం.డి ఉపాధ్యాయ్, బ్రిగేడియర్ ప్రమోద్ కుమార్ శర్మ లతో పాటు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
Tags; Roads as alternative to the golf road in the cantonment area

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *