ప్రతి వీదిలో సీసీ రోడ్లు

-వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ సెక్రటరీ వై. ప్రదీపురెడ్డి

Date:16/09/2019

మంత్రాలయం ముచ్చట్లు:

మంత్రాలయం మండల పరిధిలోని బూదూరు గ్రామంలో ప్రతి వీదిలో సీసీ రోడ్లు వేయించడం జరుగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ సెక్రటరీ వై. ప్రదీపురెడ్డి  అన్నారు. ముందుగా గ్రామంలో వెలసిన లక్ష్మమ్మ అవ్వ కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం  బూదూరు గ్రామంలో నూతనంగా 4 సీసీ రోడ్లకు 30 లక్షలు రూపాయలు మంజూరు కావడంతో సోమవారం రోడ్లకు భూమి పూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండలాధ్యక్షుడు జి. భీమిరెడ్డి, పీఆర్ జేఈ నాగ సుబ్బయ్య ,నాయకులు లక్ష్మి నారాయణ రెడ్డి, విశ్వనాథ్ రెడ్డి, రాఘవేంద్ర రెడ్డి, కాంత రెడ్డి,పాండు, నాగరాజు, జక్కయ్య, కయ్యూన్, చిరంజీవి, పాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నంద్యాలలో సహాయక చర్యలు ముమ్మరం

Tags: Roads in every street

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *