నెలకు ఏడు బైకర్స్ ప్రాణాలు తీస్తున్న రోడ్లు

Date:02/12/2019

హైద్రాబాద్ ముచ్చట్లు:

సిటీలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల్లో బైకిస్టులు చనిపోతున్నరు. ఇతర వెహికల్స్, టిప్పర్ లారీలు, బస్సులు ఓవర్ స్పీడ్, నెగ్లిజెన్స్ తో టూవీలర్స్ ని ఢీకొట్టి వారి ప్రాణాలను తీస్తున్నాయి. వారం రోజుల క్రితం బంజారాహిల్స్ రోడ్ నం.12లో జరిగిన రోడ్ యాక్సిడెంట్ ఘటన  మరువక ముందే సిటీలో జరిగిన 2 బైక్ ప్రమాదాలు తీవ్ర కలకలం రేపాయి. బుధవారం సాయంత్రం మేడ్చల్ జిల్లా కాప్రా రాధిక క్రాస్ రోడ్స్ స్కూటీపై యూటర్న్ తీసుకుంటున్న కోలేటి సరిత(35)ను టిప్పర్ ఢీకొట్టింది. టిప్పర్ టైర్లు సరిత తలమీదుగా వెళ్లడంతో ఆమె అక్కడిక్కడే చనిపోయింది. హెల్మెట్ పెట్టుకున్నప్పటికీ సరిత ప్రాణాలు దక్కలేదు.మరోవైపు   ఉదయం కెపీహెచ్ బీ వసంత్ నగర్ కాలనీలో నారాయణ కాలేజీకి చెందిన ఉద్యోగి ఖాసిం(25) యాక్టివాను శ్రీ చైతన్య కాలేజీకి చెందిన వాటర్ ట్యాంకర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వాటర్ ట్యాంకర్ వెనుక టైర్ల కిందపడి ఖాసిం చనిపోయాడు. మంగళవారం బంజారాహిల్స్ రోడ్ నం.12లో టీసీఎస్ ఎంప్లాయ్ సోహిని సక్సేనా(35) సైతం  ఆర్టీసీ బస్సు చక్రాల కింద పడి చనిపోయిన సంగతి తెలిసిందే. గ్రేటర్ లో నెలకు సగటున 34 మంది ప్రమాదాల్లో చనిపోతుండగా.. వీరిలో 8 మంది బైకిస్టులు ఉన్నట్టు  పోలీసుల కేస్ స్టడీస్ చెబుతున్నాయి.

 

 

 

 

 

నిరంతరం వెహికల్స్ రద్దీ ఎక్కువగా ఉండే సిటీ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ప్రమాదాల తీవ్రత ఎక్కువగా ఉందని పోలీసులు చెబుతున్నారు. సిటీ కమిషనరేట్ పరిధిలో  ప్రతి ఏటా సుమారు 12వందలకు పైగా బైక్ ప్రమాదాలు జరుగుతున్నట్టు పోలీసులు చెబుతున్నారు.  ఈ ఏడాది జనవరి నుంచి డిసెంబర్ వరకు జరిగిన 1,108 రోడ్ యాక్సిడెంట్స్ లో 81 మంది బైకిస్టులు మృతి చెందారు. మరో 1,298 గాయపడ్డారు. దీంతో  ప్రమాదాల నివారణ కోసం రోడ్ సేఫ్టీపై పోలీసులు ఎన్ని అవగాహనా కార్యక్రమాలు చేపట్టినా మృతుల సంఖ్య తగ్గడం లేదు. సిటీలో రోజురోజుకి పెరుగుతున్న ట్రాఫిక్ లో తక్కువ సమయంలో గమ్యస్థానాలకు చేరడానికి కార్లు,బస్సుల కంటే ఎక్కువగా వాహనదారులు బైక్స్ ను వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో సిటీ రోడ్లపై 58 నుంచి 63 శాతం మంది బైక్ జర్నీ చేస్తున్నట్టు ట్రాఫిక్ పోలీసులు అంచనా వేస్తున్నారు. 35 శాతం బైకిస్టులు ఓవర్ స్పీడ్, సెల్ ఫోన్ డ్రైవింగ్, నెగ్లిజెన్స్ కారణంగా ప్రమాదాలకు గురవుతున్నట్టు గుర్తించారు.

 

 

 

 

హెల్మెట్ లేకుండా డ్రైవ్ చేసి 23 శాతం ప్రాణాలు కొల్పోతున్నట్టు తేల్చారు.  ప్రమాదాల నివారణ కోసం హెల్మెట్ రూల్ తప్పనిసరి చేయడంతో సిటీ రోడ్లపై తిరిగే 97 శాతం మంది బైకిస్టులు హెల్మెట్ వాడుతున్నట్టు ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేశారు. బంజారాహిల్స్,కాప్రాలో జరిగిన రోడ్ యాక్సిడెంట్స్ లో  హెల్మెట్ పెట్టుకుని డ్రైవ్ చేస్తున్న ఇద్దరు ప్రాణాలు కొల్పోవడం ఆందోళన కలిగిస్తున్నట్లు వారు పేర్కొన్నారు.సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో ఈ ఏడాది జనవరి నుంచి అక్టోబర్ 31 వరకు జరిగిన రోడ్డు ప్రమాదాల్లో 720 మంది మృతి చెందగా అందులో 388 మంది బైకిస్టులు ప్రాణాలు కొల్పోయినట్టు పోలీసులు చెబుతున్నారు. 94శాతం మంది హెల్మెట్ వాడకపోవడం, సెల్ ఫోన్ డ్రైవింగ్ వల్లే మరణిస్తున్నట్టు గుర్తించారు.  ప్రమాదాల నివారణకు సైబరాబాద్ పోలీసులు అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. బైక్ పై వెళ్లేవారు తప్పనిసరిగా క్వాలిటీ హెల్మెట్లను ధరించే విధంగా డూప్లికేట్ హెల్మెట్ల నివారణపై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25న సైబరాబాద్ లోని హెల్మెట్ షోరూమ్స్,గోడౌన్లపై దాడులు చేసి 10 షాపుల ఓనర్స్ పై క్రిమినల్ కేసులు నమోదు చేశారు.

వేధింపులు, ఆత్మహత్య అంటూ మెసేజ్

Tags: Roads where seven bikers per month survive

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *