ఉసురు తీస్తున్న రహదారి గోతులు

Roadside silos

Roadside silos

– అదమరిస్తే… అదో గతి

Date:10/12/2019

పుంగనూరు ముచ్చట్లు:

ఇటీవల కాలంలో రహ దారుల్లో ఏర్పడిన గోతుల కారణంగా వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు. రహదారిపై ఏర్పడిన గోతులు పూడ్చడంలో సంబంధించిన అధికారులు ఉదాసీనంగా వ్యవహరించడంతో నిత్యం ఎక్కడో ఒకచోట ప్రమాదం సంభవిస్తోంది. పుంగనూరు నుంచి మదనపల్లికి వెళ్లే రహదారిలో సిద్ధప్పగుంట వద్ద హంద్రీనీవా కాలువ కోసం భీమగానిపల్లి…గాంధీపురం మధ్యలో వంతెన నిర్మించడం కోసం రోడ్డును త్రవ్వి వంతెన వేశారు. అయితే వంతెన నిర్మించిన ప్రదేశంలో రోడ్డు వేయకుండా వదిలేయడంతో పెద్ద గోతి ఏర్పడింది. ఈ మార్గంలో నిత్యం వందల సంఖ్యలో వాహనాలు మదనపల్లి వైపు… చిత్తూరు వైపు వెళుతుంటాయి. అసలే రహదారి… ఆపై వాహనాల దూకుడు కారణంగా రహదారిపై ఏర్పడిన గోతుల కారణంగా తృటిలో పెను ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్లు ఏ మాత్రం అదమరిచినా ప్రాణాలు గాల్లో కలవడం ఖాయమని ప్రయాణికులు వాపోతున్నారు. మంగళవారం చిత్తూరుకు చెందిన ఓ కుటుంబం మదనపల్లి వైపు నుంచి చిత్తూరుకు కారులో వెళుతుండగా రహదారిపైనున్న గోతిని తప్పించబోయిన డ్రైవర్ అదుపు తప్పి ప్రక్కనే ఉన్న సిద్ధప్పగుంటలోకి కారు పల్టీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న వారు స్వల్ప గాయాలతో బయట పడ్డారు. కారు మాత్రం నుజ్జునుజ్జు అయ్యింది. తృటిలో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. అంతేకాకుండా సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు నిత్యం ఈ రహదారిపై ప్రయాణిస్తున్న వారికి ఈ గోతులు కనపడకపోవడం గమనార్హం. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి రహదారిపై ఏర్పడ్డ గోతులు పూడ్చి ప్రమాదాలను నివారించాలని ప్రయాణికులు, స్థానికులు కోరుతున్నారు.

 

మానవ హక్కుల సంఘానికి పోలీసుల సాక్ష్యాలు

 

Tags:Roadside silos

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *