Natyam ad

పదవ తరగతి ప్రశ్నాపత్రాల లీకేజీని అరికట్టడం కోసం పటిష్టమైన క్యూఆర్ సాంకేతికత.. 

-జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్

 

రాయచోటి  ముచ్చట్లు:

Post Midle

పదవ తరగతి ప్రశ్నా పత్రాల లీకేజీని అరికట్టడం కోసం పటిష్టమైన క్యూఆర్ సాంకేతికతను ఉపయోగిస్తున్నట్లుగా జిల్లా కలెక్టర్ అభిషిక్త్ కిషోర్ ఒక ప్రకటనలో తెలిపారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… పదవ తరగతి పరీక్షలను రాష్ట్ర ప్రభుత్వం వివిధ చర్యల ద్వారా అత్యంత పటిష్టవంతంగా నిర్వహించడం జరుగుతోందని తెలిపారు.  ప్రశ్నాపత్రాల సీల్డ్ కవర్లను తెరిచేటప్పుడు సీసీ టీవీ కెమెరాల ద్వారా పర్యవేక్షించడం, పరీక్ష కేంద్రాలలో సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయడం, ఫ్లయింగ్  స్క్వాడ్లు, వంటి అనేక చర్యల ద్వారా పరీక్షలను పటిష్టవంతంగా నిర్వహించడం జరుగుతోందన్నారు. ఈ సంవత్సరం పదవ తరగతి పరీక్షలకు ముద్రించే ప్రశ్నాపత్రాలలో క్యూఆర్ కోడ్ ముద్రించబడుతుందని, రాష్ట్రంలో పరీక్ష రాయబోయే ప్రతి విద్యార్థికి ఇవ్వబోయే ప్రశ్నాపత్రంలో క్యూఆర్ కోడ్ వేరువేరుగా ఉంటుందని, ఏదైనా  అవాంఛనీయ సంఘటన జరిగి, ప్రశ్నాపత్రం లీకేజీ అయితే ఆ ప్రశ్న పత్రం ఏ విద్యార్థి దగ్గర నుంచి లీక్ అయిందో క్యూఆర్ కోడ్ ద్వార.

 

Tags:Robust QR technology to prevent leakage of class 10 question papers.

Post Midle