పోలీసులపై రౌడీ మూకల కాల్పులు

-ఎనిమిది మంది పోలీసులు మృతి

Date:03/07/2020

కాన్పూర్  ముచ్చట్లు:

ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో రౌడీ మూక రెచ్చిపోయింది. కాన్పూర్ లోని రౌడీ షీటర్ వికాస్ దూబే నివాసంలో జరిగిన కాల్పుల్లో ఎనిమిది మంది పోలీసులు మరణించారు. మరో ఆరుగురు గాయపడ్డారు. వికాస్ దూబే కోసం అతని ప్రాంతంలో సోదాలు నిర్వహిస్తున్న సమయంలో పోలీసులపైకి కాల్పులు జరిగాయి. గాయపడినవారిలో నలుగురి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది.మృతుల్లో డిప్యూటీ ఎస్పీ దేవేంద్ర మిశ్రా ఉన్నారు. ఈ సంఘటన గురువారం  అర్థరాత్రి దాటిన తర్వాత జరిగింది. ఎస్ఎస్పీ, ఐడి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆ ప్రాంతాన్ని పరిశీలిస్తున్నారు. మృతుల్లో ఓ డీఎస్పీ, ముగ్గురు సబ్ ఇన్ స్పెక్టర్లు, నలుగురు కానిస్టేబుల్స్ ఉన్నారు. ఎస్సైలు మహేష్ యాదవ్, నేబులాల్, అనూప్ కుమార్, జవాన్లు సుల్తాన్ సింగ్, రాహుల్, బబ్లూ, జితేంద్రలు మృతి చెందారు.  రాష్ట్ర రాజధాని లక్నో కి 150 కిలో మీటర్ల దూరంలో వున్న దిక్రూ  గ్రామంలో ఈ ఘటన జరిగింది. ఈ ప్రాంతం చౌబేపూర్ పోలీసు స్టేషన్ పరిధిలో వుంది. వికాస్ దుబేపై దాదాపు ఆరవై క్రిమినల్ కేసులున్నాయి. హత్యలు, బెదిరింపులు, దొమ్మికి సంబంధించిన కేసుల్లో దుబే నిందితుడు. 2001  లో దుబే ఒక బీజేపీ నేతను చంపడానికి వెంటబడ్డాడు. ఆ నేత దగ్గరిలోని ఒక పోలీసు స్టేషన్ లోకి వెళ్లపోయాడు. అయినా వదలకుండా దుబే ఆ నేతను పోలీసు స్టేషన్ లోనే హతమార్చాడు. విచిత్రంగా దుబే ఆ హత్య కేసులో నిర్దోషిగా బయటపడ్డాడు.  తాజాగా ఒక హత్యాయత్నం కేసులో దుబేను ఆరెస్టు చేయడానికి మూడు పోలీసు స్టేషన్లనుంచి పోలీసులు అతని గ్రామానికి వెళ్లారు.

 

 

ఘటనపై ఒక పోలీసు ఉన్నతాధికారి మాట్లాడుతూ గ్రామంలోని దారిలో ఒక బుట్ డోజర్లు అడ్డంగా నిలిపారు.  దుబే అనుచరులు గ్రామంలో పోలీసులు రాకుండా రోడ్డుపై రాళ్లు వేసారని అన్నారు. అడ్డంకులను దాటుకుని గ్రామంలోకి వెళ్లిన పోలీసులపై మూడు వైపులనుంచి కాల్పులు జరిగాయని అన్నారు. గ్రామంలోని రోడ్లు రక్తసిక్తం అయ్యాయి. గాయపడిన పోలీసులను ఆసుపత్రికి తరలించారు. నిందితులంతా పరారీలో వున్నారు. పెద్ద ఎత్తున బలగాలు ఆ ప్రాంతాన్ని గాలిస్తున్నాయి. ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్ ఘటనపై విచారం వ్యక్తం చేసారు.  దర్యాప్తుకు ఆదేశించారు.

శ్రీ పద్మావతి అమ్మవారిని ర్శించుకున్న కావలి ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి

Tags: Rogue shootings on police

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *