మళ్లీ జబర్దస్త్ లోకి రోజా

Roja again into Zabardath

Roja again into Zabardath

Date:30/04/2019
హైద్రాబాద్ ముచ్చట్లు:
ఈటీవీలో ప్రసారమవుతోన్న ‘జబర్దస్త్’ కామెడీ షో ఎంత పాప్యులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ కామెడీ షోకి నాగబాబు .. రోజా న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఎన్నికల సమయంలో వీళ్ల స్థానాల్లో శేఖర్ మాస్టర్ .. మీనా ఈ కార్యక్రమంలో కనిపించారు. ఇక నాగబాబు .. రోజా ఇద్దరూ కూడా ఈ కార్యక్రమానికి తిరిగిరాకపోవచ్చనే ప్రచారం జరిగింది.కానీ ‘జబర్దస్త్’కి రోజా తిరిగొచ్చేసింది. ఈ వారం ప్రసారం కానున్న ఎపిసోడ్ ప్రోమోలో రోజా కనిపించింది. ఇక తాను ఎన్నికల్లో గెలిచి ఎంపీ అయినా, ‘జబర్దస్త్’ ను వదులుకునేది లేదని ఇటీవల నాగబాబు చెప్పారు. అందువలన త్వరలోనే నాగబాబు కూడా జాయిన్ కావడం ఖాయమని తెలుస్తోంది. అప్పటివరకూ రోజా .. మీనా న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తారన్న మాట.
Tags: Roja again into Zabardath

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *