మళ్లీ రోజా వర్సెస్ బండారు

విశాఖపట్టణం ముచ్చట్లు:

మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి వర్సెస్‌ వైసీపీ మంత్రి, ఎమ్మెల్యే రోజా యుద్ధం ఆగినట్లే ఆగి మరోసారి మొదలైంది. నెల రోజుల క్రితం రోజాపై బండారు అసభ్యకర వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అప్పుడే ఆయన్ను అరెస్ట్ చేశారు. తర్వాత విడుదల కూడా చేశారు. బండారు వ్యాఖ్యలపై మహిళ సంఘాలతో పాటు మహిళా కమిషన్‌ సైతం మండిపడింది. ఓ మహిళా, అందులోనూ ప్రజాప్రతినిధి అయిన మహిళపై ఇలాంటి కామెంట్స్ చేస్తారా అంటూ ఆయనపై విరుచుకుపడ్డారు. బండారు వ్యాఖ్యలతో రోజా కంటతడి కూడా పెట్టారు. ఇప్పుడు మరోసారి ఆయనపై న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. మాజీమంత్రి, టీడీపీ నేత బండారుపై మంత్రి రోజా పరువునష్టం దావా వేశారు. నగరి కోర్టులో క్రిమినల్ డిఫమేషన్ పిటిషన్ దాఖలు చేశారు రోజా. మాజీ మంత్రి బండారుతో పాటు మరో ఇద్దరిపై పిటిషన్ వేశారు. నగరి టీడీపీ ఇంచార్జ్ గాలి భానుప్రకాశ్‌తో పాటు ఓ ప్రముఖ టీవీ ఛానెల్‌కు చెందిన వ్యక్తిపైనా పిటిషన్ వేశారు. మంత్రి రోజా పిటిషన్‌ని కోర్టు స్వీకరించింది.

 

 

 

రోజా స్టేట్‌మెంట్‌ను నమోదు చేశారుమంత్రి రోజాపై బండారు సత్యనారాయణ అనుచిత వ్యాఖ్యలు చేశారు. తన దగ్గరున్న వీడియోలు బయటపెడితే రోజా, ఆమె భర్త ఆత్మహత్య చేసుకుంటారని, ఆమె కుటుంబం చిన్నాభిన్నమవుతుందన్నారు. ఈ అనుచిత వ్యాఖ్యలపై మహిళా కమిషన్ సీరియస్ గత నెలలో సిరీయస్‌ అయింది. బండారు సత్యనారాయణను అరెస్టు చేయాలంటూ డీజీపీకి లేఖ రాశారు ఏపీ మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌ వాసిరెడ్డి పద్మ.’బ్లూ**’, ‘గెస్ట్ హౌస్’, ‘బ** బతుకమ్మ’ లాంటి అనుచిత వ్యాఖ్యలు చేయడం టీడీపీను ఇరకాటంలో పడేశాయి. ఓ మహిళా మంత్రితో టీడీపీ నేతలు మాట్లాడే తీరు ఇదేనా అని వైసీపీ నేతలు ప్రశ్నించారు.

 

Tags:Roja vs. Bandaru again

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *