Date:18/01/2021
పుంగనూరు ముచ్చట్లు:
మున్సిపాలిటి పరిధిలోని 31 వార్డుల్లోను పారిశుద్ధ్య కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయడంలో సచివాలయ శానిటరీ ఉద్యోగులు , వలంటీర్ల పాత్ర ఎంతో కీలకమని కమిషనర్ కెఎల్.వర్మ తెలిపారు. సోమవారం మున్సిపాలిటిలో సచివాలయ ఉద్యోగులు, వలంటీర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ సచివాలయ శానిటరీ కార్యదర్శులు ప్రతి రోజు ఉదయం 5 గంటలకు మున్సిపాలిటి కార్మికుల మస్టర్‌కు హాజరుకావాలన్నారు. వీటితో పాటు చెత్తను సేకరించే సమయంలో తడిచెత్త, పొడిచెత్తను వేరుచేసి, దానిని తూకం వేసి, వివరాలను రిజిస్టర్లో నమోదు చేయాలన్నారు. ఈ చెత్తను కంపోస్ట్ యార్డుకు చెత్తను తరలించి, ఎరువుగా తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ ఎరువును రైతులకు విక్రయించడంతో ఆదాయం చేకూరుతుందన్నారు. చెత్త నుంచి సంపద తయారీ అనే నినాదాన్ని పటిష్టంగా అమలు చే యాలన్నారు. ముఖ్యంగా పట్టణంలోని మహిళలచే హ్గం కంపోస్ట్ తయారీని విరివిగా చేపట్టాలన్నారు. వీటితో పాటు పట్టణంలో అనధికార వ్యాపారాలను , ప్రకటనలను క్రమబద్దీకరించి, ప్రతి ఒక్కరికి లైసెన్సులు మంజూరుచేయాలన్నారు. లైసెన్సులు పొందకుండ వ్యాపారాలు కొనసాగించే వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. ఈ సమావేశంలో మేనేజర్ రసూల్‌ఖాన్, ఆర్వో రామకృష్ణ, అకౌంట్స్ ఆఫీసర్ మనోహర్, శానిటరీ ఇన్స్పెక్టర్లు సఫ్ధర్, సురేంద్రబాబు పాల్గొన్నారు.
అయోధ్యలో రామాలయ నిర్మాణానికిఅర్వపల్లి కోటేశ్వర్రావు సత్యవతి దంపతులు విరాళo
Tags:Role of Secretariat Secretaries in Sanitation Programs in Punganur – Commissioner KL Verma