రెవెన్యూతో “రోల్స్” విచారణ – దానకిషోర్

"Rolls" trial with revenue - Danakishor

"Rolls" trial with revenue - Danakishor

 Date:15/09/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
ఏడుగురు డిప్యూటి కలెక్టర్లు, 15మంది తహశీల్దార్లు, 100మంది వీఆర్వోలు హైదరాబాద్ జిల్లా జాయింట్ కలెక్టర్ రవి నేతృత్వంలో జిల్లాలోని 14 నియోజకవర్గాల్లో ఓటర్ల జాబితాను జల్లెడ పట్టనున్నారు. మరణించినవారి ఓట్లను తొలగించడం, డబుల్ ఎంట్రీ ఓట్లను గుర్తించి నోటీసులు జారీచేయడం, 18 ఏళ్లు నిండినవారిని ఓటర్లుగా నమోదు చేయించడంతో పాటు ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో కనీసం వెయ్యి మంది ప్రముఖుల ఓట్ల పై మరోసారి క్షుణ్ణంగా తనిఖీచేసే ప్రక్రియను 15, 16, 17 తేదీల్లో మూడు రోజుల పాటు విస్తృతంగా చేపడుతారని హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ ఎం.దానకిషోర్ వెల్లడించారు.
హైదరాబాద్ జిల్లాలో ఓటర్ల జాబితా సవరణకు జీహెచ్ఎంసీతో పాటు ఇతర శాఖల అధికారులు, సిబ్బంది సేవలను ఉపయోగించడం జరిగిందని, జాబితా సవరణను మరింత పకడ్బందీగా చేపట్టడానికి మొట్టమొదటి సారిగా రెవెన్యూ శాఖ యంత్రాంగాన్ని హైదరాబాద్లో పూర్తిస్థాయిలో ఉపయోగించనున్నట్టు కమిషనర్ పేర్కొన్నారు.
రెవెన్యూ అధికారులకు ఇప్పటికే నియోజకవర్గాల వారిగా జాబితాలను అందజేశామని, వాటిలో ఒకే ఓటరు ఒకే పోలింగ్ పరిధిలో, నియోజకవర్గ పరిధిలో, ఇతర జిల్లాల పరిధిలో ఓటరుగా నమోదు అయితే ఎన్నికల సంఘం ఇటీవల అందించిన ఆధునిక సాఫ్ట్వేర్ ఇ.ఆర్.ఓనెట్ 2.5 ద్వారా గుర్తించడం జరుగుతుందని పేర్కొన్నారు. బహుళ ఓటరుగా నమోదు అయితే తగు నోటీసులు అందజేసి కోరుకున్న పరిధిలోనే ఒకే ఓటు ఉండేవిధంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొన్నారు. ఈ మూడు రోజుల ప్రక్రియను హైదరాబాద్ జిల్లా కలెక్టర్ రఘునందన్రావు, జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ అమ్రపాలి కాటలు పర్యవేక్షిస్తారని జిల్లా ఎన్నికల అధికారి దానకిషోర్ వివరించారు.
Tags:”Rolls” trial with revenue – Danakishor

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *