Natyam ad

పూణెలో రొమాన్స్ స్కాం…

ముంబై ముచ్చట్లు:

అది డేటింగ్ యాప్.. ఏదో సరదాగా పిన్ చేశాడు.. అంతే ఓ అమ్మాయి కనెక్ట్ అయ్యింది.. ఫొటో పెట్టింది.. అది ఒరిజినల్.. అందంగా ఉంది.. అంతకు మించి చాలా స్మార్ట్ గా ఉంది. మాటలు కలిశాయి.. డేటింగ్ యాప్ కావటంతో ఒకే అన్నాడు కుర్రోడు.. అంతే 24 గంటల్లో జీవితం తలకిందులు ఏమీ కాలేదు.. బాగా బుద్ధి వచ్చింది.. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు బాధితుడు.. 10 లక్షల మంది దీన్ని షేర్ చేయటంతో వైరల్ అయ్యింది.. ఇంతకీ వివరాలు ఏంటీ అంటారా.. అందులోకే వెళతున్నాం..అది మహారాష్ట్ర.. పూణె. మీట్ అండ్ రిఫ్రెష్.. టేబుల్ డేటింగ్ అన్నమాట.. గార్ల్ ఫ్రెండ్ లేనోళ్లకు సాయంత్రం పూట సరదాగా మూడు, నాలుగు గంటలు ఏ రెస్టారెంట్ లోనో.. బార్ లోనే చిట్ చాట్ అన్నమాట.. అలాంటి డేటింగ్ యాప్ లోకి వెళ్లాడు ఓ కుర్రోడు.. ఓ అమ్మాయి కనెక్ట్ అయ్యింది. ఈవినింగ్ ఆ పబ్ లో కలుద్దాం అని చెప్పింది. ఓకే అన్నాడు. సెంటు కొట్టుకుని శుభ్రంగా రెడీ అయ్యి.. హీరో లెక్క వెళ్లాడు.. టేబుల్ రెడీ.. అమ్మాయి వచ్చింది.. సూపర్ గా ఉంది.. కాకపోతే కొంచెం ఫాస్ట్.. ఏది ఏమైనా వెంట వెంటనే చెప్పాలి.. నాన్చుడు వద్దు అని అమ్మాయి అనటంతో.. ఇంకా ఖుషీ అయ్యాడు. వచ్చీ రాగానే.. హుక్కా ఆర్డర్ చేసింది.. అది 10 వేల రూపాయలు.. వైన్ బాటిల్ ఆర్డర్ చేసింది అది 15 వేల రూపాయలు.. స్పెషల్ గా వైన్ గ్లాస్ చెప్పింది అది 15 వందల రూపాయలు..

 

 

చిల్లీ పొటాటో, క్రిస్పీ కార్న్, వాటర్ బాటిల్ ఇలా చకచకా చెప్పేసింది.. ఫుల్ గా మందు కొట్టింది. మనోడు రెండు పెగ్గులు తాగేలోపు అక్కడ ఫుల్ బాటిల్ ఖాళీ.. బిల్లు వచ్చింది. మొత్తం 23 వేల రూపాయలు.. షాక్.. మైండ్ బ్లాంక్.. ఇంత బిల్లు ఏంటీ.. హుక్కా 10 వేలు ఏంటీ.. వైన్ బాటిల్ 15 వేలు ఏంటీ నిలదీశాడు..లోపలనున్న అపరిచితురాలు బయటకు వచ్చింది. బిల్లు కట్టలేదు అనుకో పార్కింగ్ లో ఉన్న నీ కారు పగిలిపోతుంది.. నీ కారు నెంబర్ తెలుసు కాబట్టి.. ఆర్టీవోలో అడ్రస్ కనుక్కుని.. ఇంటికొచ్చి 50 వేలు వసూలు చేస్తాం.. నీ డేటింగ్ యాప్ డీటెయిల్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్ కు పంపిస్తాం.. అసలు నువ్వు ఈ పబ్ నుంచి ఎలా బయటకు వెళతావో చూస్తాం అంటూ వార్నింగ్ ఇచ్చింది.. అప్పటికీ మనోడు బుర్రకు తెలిసింది.. ఇదంతా పబ్ లోని కొందరు వెయిటర్స్ అండ్ ఈ అమ్మాయి ఆడిన డ్రామా అని.. ఏమీ చేయలేక బిల్లు కట్టి బయటకు వచ్చి.. దమ్ము కొట్టి వెళ్లిపోయాడు. కాకపోతే తనకు జరిగిన అన్యాయం.. పూణెలో జరుగుతున్న కొత్త తరహా మోసాలు మరొకరికి జరగకూడదని.. తన అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నాడు.. ఇప్పటికే 10 లక్షల మంది కనెక్ట్ అయ్యారు.. బ్రో.. పోతేపోయింది 23 వేలు మాత్రమే.. ఇంకా ముందుకు వెళ్లి ఉంటే.. టూర్ వేసి ఉంటే 2 లక్షలు పోయేవి అంటూ సానుభూతి వ్యక్తం చేస్తున్నారు.

 

Post Midle

Tags: Romance Scam in Pune…

Post Midle