అక్కరకు రానీ సాఫ్ట్ వేర్…ముందుకు సాగని టౌన్ ప్లానింగ్ 

Date:20/08/2019

రాజమండ్రి ముచ్చట్లు:

రాజమండ్రి టౌన్‌ ప్రణాళిక విభాగం సమస్యలతో సతమతమవుతోంది. సాఫ్ట్‌వేర్ రూపకల్పనలో ప్రైవేటు సంస్థకు పట్టణ ప్రణాళికపై అవగాహన లేకపోవడంతో, పట్టణ ప్రణాళికా విభాగానికి సాఫ్ట్‌వేర్‌పై అవగాహన లేకపోవడం, క్షేత్రస్థాయి రికార్డులు కంప్యూటరీకరణ అవ్వకపోవడం ప్లానుల పాలిట శాపంగా మారింది. క్రమబద్ధీకరణ జరిగిన స్థలాలు, భూములు, కన్వర్షన్ అయిన స్థలాలు, లే అవుట్లు, నాన్ లేఅవుట్లు, ఎల్‌ఆర్‌ఎస్ జరిగిన వివరాలు, తదితర సమగ్ర వివరాలు కంప్యూటరీకరణ జరిగినప్పుడే ఆన్‌లైన్ ఆమోదం సాధ్యమవుతుంది.

 

 

 

జీవో 119మార్గదర్శకాల ప్రకారం ప్లాను మంజూరుకు సబ్‌డివిజన్ జరిగిన స్థలాల వివరాలు పొందుపర్చాల్సి ఉంది.  స్థలాల సబ్‌డివిజన్ వివరాలు సాఫ్ట్‌వేర్‌లో నిక్షిప్తం కాలేదు. దీంతో ప్లాను మంజూరులు నిలిచిపోయాయి. ఆన్‌లైన్‌లో డేటా ఎంట్రీ అవ్వడంలేదు. ప్రస్తుతం ఈ వివరాలు ఏమీ కంప్యూటరీకరణ జరగలేదు. దీంతో ప్లానుల అనుమతి రాక, తమ దరఖాస్తులు ఎక్కడ పెండింగ్‌లో ఉన్నాయో తెలియని అయోమయంతో నిర్మాణదారులు కార్యాలయాలు చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నారు.రాష్ట్ర విభజన తర్వాత 13 జిల్లాల్లోని భూములు, స్థలాలకు సంబంధించిన సమగ్ర సమాచారాన్ని ఈ విభాగంలో కంప్యూటరీకరించడంలో అలసత్వంతో సాఫ్ట్‌వేర్‌లో ప్లాన్ అనుమతులు సకాలంలో రాక వేలాది దరఖాస్తులు పెండింగ్‌లో పడ్డాయి.

 

 

 

 

 

13 జిల్లాల్లో దాదాపు 1687 దరఖాస్తులు స్తంభించినట్టు తెలుస్తోంది. కార్యకలాపాలు మందగించడంతో ఆదాయం కూడా స్తంభించింది. దీంతో ఈ విభాగంలో ఆదాయ లక్ష్యానికి దూరంగా ప్రణాళిక సాగుతోందని, పురోగతి కనిపించడంలేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భూముల సబ్ డివిజన్ రికార్డులు వరకూ పరిమితమయ్యింది. క్షేత్ర స్థాయిలో సబ్ డివిజన్ జరిగిన రికార్డులు ప్రణాళికా విభాగంలో అందుబాటులో లేకపోవడంతో ఆ సమాచారాన్ని నిక్షిప్తం చేయలేకపోయారు. ప్లాన్ అప్రూవల్స్‌కు ప్రతిబంధకంగా మారింది.

 

 

 

 

ఆన్‌లైన్‌లో ప్లాన్ అనుమతులు ఇవ్వడంలేదు. ఆన్‌లైన్ సమస్యలు అధిగమించాలంటే ప్రస్తుత సాఫ్ట్‌వేర్‌కు అనుబంధ సాఫ్ట్‌వేర్‌ను అనుసంధానం చేయాలని బిల్డర్లు సూచిస్తున్నారు. అనుసంధానం కాని క్షేత్రస్థాయి రికార్డుల కారణంగా పట్టణ ప్రణాళికా విభాగంలో సాఫ్ట్‌వేర్ చిక్కుముడులు ఎదురయ్యి ప్రణాళికాబద్ద అభివృద్ధి అంగుళం కూడా ముందుకు జరగడంలేదని తెలుస్తోంది. లే అవట్లు, ఇంటిప్లాన్లు సకాలంలో మంజూరుకాక నిర్మాణ, రియల్ ఎస్టేట్ రంగాలు స్తంభించాయి.

 

 

 

పట్టణ ప్రణాళికా విభాగంలో ఆధునిక టెక్నాలజీ అనుసంధానం జరిగింది తప్ప అవసరమైన రికార్డులు అనుసంధానం కాలేదని, దీంతో సాఫ్ట్‌వేర్ సంస్థకు, ప్రణాళికా విభాగం మధ్య సమన్వయలోపం తలెత్తిందంటున్నారు.  పట్టణ ప్రణాళిక విభాగంలో ఆధునిక విధానాలు అసలుకే ఎసరు తెచ్చిన విధంగా మారింది. అవినీతికి తావులేకుండా పేపర్‌లెస్ ఆమోదం అంటూ గొప్పగా చెబుతూ ప్రవేశెట్టిన ఆన్‌లైన్ ఆమోదాలు కాస్తా ముందుకు కదలని పరిస్థితి దాపురించింది. ఆన్‌లైన్ ఆమోదాల వల్ల సవాలక్ష సమస్యలు తలెత్తుతున్నాయి. సాంకేతికత అందుబాటులోకి తెచ్చిన స్థాయిలో సిబ్బందికి కూడా అవగాహన కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

 

 

ఉదాహరణకు 420 గజాల స్థలాన్ని ఇద్దరు వ్యక్తులు చెరో 210 గజాలు చొప్పున కొనుగోలు చేసుకుంటే అది డాక్యుమెంట్ ప్రకారం ఎవరి హద్దులతో వారి రికార్డు తయారవుతుంది. ఈ రికార్డు పట్టణ ప్రణాళికా విభాగంలో కంప్యూటర్‌లో నిక్షిప్తమవ్వలేదు. దీంతో ఆన్‌లైన్ దరఖాస్తును కంప్యూటర్ అంగీకరించడం లేదు. ఈ స్థలాల విభజన డాక్యుమెంటు ప్రకారం జరిగింది తప్ప క్షేత్రస్థాయిలో సబ్ డివిజన్ కాలేదు. ఆన్‌లైన్‌లో ప్లాను ఆమోదం పొందాలంటే 12 రకాల సమాచారాన్ని నిర్ధేసిత ఫార్మట్‌లో స్కాన్ చేసి ఆ వివరాలను కంప్యూటర్‌లో పొందుపర్చాల్సి ఉంది.

వైజాగ్ స్టేషన్ లో యాప్ బేస్డ్ క్యాబ్స్

Tags: Ronnie software for that matter … Town planning ahead

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *