గులాబీ బాస్ 2.0

Date:21/11/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
చిన్న గ్యాప్ తరువాత రీ ఎంట్రీ ఇచ్చిన గులాబీ బాస్ ప్రసంగాల కోసం అంతా ఎదురు చూశారు. అనుకున్నట్లే ప్రత్యర్థులను బంతాడుకున్నారు. ఖమ్మం, పాలకుర్తి, పాలేరు సభల్లో మహాకూటమి మాయా కూటమి అంటూ తనదైన వాగ్ధాటి చతురోక్తులు, వ్యంగ్యాస్త్రాలు, ఆరోపణలు, విమర్శలు సంధించారు. కాంగ్రెస్ పై కన్నా తెలుగుదేశాన్ని పూర్తిగా టార్గెట్ చేశారు. చంద్రబాబు గాలి మొత్తం తీసేలా సాగింది ఆయన ప్రసంగం. టిజెఎస్, సిపిఐ జోలికి పోకుండా తెలంగాణ సెంటిమెంట్ ఆయుధంగా అయన ప్రసంగం సాగించారు.
ఇక కెసిఆర్ ఇదే తీరులో దుమ్మురేపుతారనే అంతా భావించారు. రెండో రోజు అత్యధికభాగం చేసిన పనులను, చేయబోయే పనులను గతంలో పార్టీలు చేసిన తప్పులను ప్రస్తావిస్తూ తన ప్రసంగాలు సాగించి ఆశ్చర్య పరిచారు గులాబీ బాస్. అయితే కూటమి వస్తే కరెంట్ లేకుండా పోతుందనేది మాత్రం రెండొవ రోజు సభల్లో మాట్లాడారు. కాంగ్రెస్ హయాంలో 10 ఏళ్ళల్లో ఇసుక పై 9 కోట్ల 56 లక్షల రూపాయలు ప్రభుత్వానికి ఆదాయం వస్తే ఇప్పుడు నాలుగేళ్లలో 2050 కోట్ల రూపాయలు సర్కార్ కి తమ ప్రభుత్వం తెచ్చిందనే అంశం ప్రతి చోటా మాట్లాడారు. సిరిసిల్లలో స్థానిక నాయకుడు కాళేశ్వరం ప్రాజెక్ట్ కి చంద్రబాబు అడ్డం పడుతున్న వైనాన్ని ప్రస్తావించాలని కెసిఆర్ ను కోరినా ఆయన వారిని విమర్శించడానికి సమయం సరిపోదంటూ చెప్పడం గమనార్హం.
తొలి రోజు సభల్లో వచ్చిన ఫీడ్ బ్యాక్ తోనే రొండో రోజు గులాబీ బాస్ ప్రత్యర్థులను అసలు పట్టించుకోనట్లుగా ప్రచారం సాగించడం విశేషం. వారిపై విమర్శలు చేసే సమయం ఇంకా ముందు ముందు ఉన్నందున ప్రచార అస్త్రాలన్నీ ఒకేసారి బయట పెట్టకుండా గులాబీ అధినేత వ్యూహాత్మకంగా సాగుతున్నట్లు కనిపిస్తుంది. కూటమి స్టార్ క్యాంపైన్ మొదలయ్యాకా ఎట్లాగూ ప్రత్యర్థులపై విరుచుకుపడాలిసి వుంది. తొలిరోజు విమర్శల దాడి కి విపక్షాలు కొద్ది రోజులు ప్రతి దాడికి దిగుతాయి కనుక కాంగ్రెస్ అధినేతలు, టిడిపి అధినేత చంద్రబాబు, ప్రధాని మోడీ, షా వంటివారు వచ్చాకా అసలు దాడి చేయాలనే వ్యూహాన్ని కెసిఆర్ అనుసరిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
Tags; Rose bass 2.0

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *