రోషిని కేర్ అఫ్ తూర్పు గది  ఆడియో విడుదల 

Roshini Care of East Room Audio Release

Roshini Care of East Room Audio Release

Date:14/05/2018
  సినిమా ముచట్లు:
శ్రీవారి క్రియేషన్స్ పతాకం పై మున్నా, ప్రియాంక ఆగస్టీన్ హీరో హీరోయిన్లు గా ఎస్. శ్రీనివాస్ మరియు ఎస్. సుధీర్ సంయుక్త నిర్మాణం లో శరగడం శ్రీనివాస్ దర్శకత్వం లో జి వి కె సమర్పణలో రూపుదిద్దుకుంటున్న చిత్రం  రోషిని కేర్ అఫ్ తూర్పు గది. ఇటీవలే ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమం సినీ ప్రముఖుల చేతుల మీదుగా ఘనంగా జరిగింది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ఫిలిం ఫెడరేషన్ అఫ్ ఇండియా వైస్ ప్రెసిడెంట్ సి. కళ్యాణ్  ఆడియో సి డి ని విడుదల చేసి మొదటి సి డి ని తెలుగు ఫిలిం చాంబర్ కార్యదర్శి ముత్యాల రాందాసుకు అందజేశారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ “ఈ మధ్యకాలంలో కథ బలం వున్న సినిమాలనే ప్రేక్షకులు ఆదరిస్తున్నారు. వాళ్ళకి చిన్న పెద్ద తేడా లేదు, అందుకే మంచి కథలతో సినిమాలు తీస్తే తప్పక విజయం సాధిస్తాయి. ఇండస్ట్రీ లో ఎంప్లాయిమెంట్ ఎక్కువగా చిన్న సినిమాల వల్లనే జరుగుతుంది. వాటి సర్వైవల్ కోసం ప్రభుత్వం 5వ షో  ఇస్తుంది, దానివల్ల చిన్న సినిమాలకు మంచి జరుగుతుంది. చిన్న సినిమాలకు మీడియా వాళ్ళు సహకరించాలి  ” అని అన్నారు.
చాంబర్ సెక్రటరీ ముత్యాల రాందాసు మాట్లాడుతూ “చిత్ర సంగీత దర్శకుడు రాజ్ కిరణ్ చక్కటి సంగీతం అందించారు, ఖచ్చితంగా పాటలు అందరికి నచ్చుతాయి. చిన్న సినిమాలకి చాంబర్ సహాయం ఎప్పుడు ఉంటుంది” అని అన్నారు.  చిత్ర దర్శకుడు, నిర్మాతలలో ఒక్కరైనా శరగడం శ్రీనివాస్ మాట్లాడుతూ “ఎన్నో ఏళ్ళ నుంచి సినిమా ఇండస్ట్రీ ని నమ్ముకుని ఉన్నాను. ఎంతో కష్టపడి ఈ సినిమా తీసాను.  చిత్ర నిర్మాణం లో ప్రతీ టెక్నీషియన్  హీరో హీరోయిన్ మాకు బాగా సహకరించారు. ఈ రోజు ఈ కార్యక్రమానికి మోహన్ గౌడ్  తన భుజాలమీద వేసుకుని జరిపించారు. అందరికి నా ధన్యవాదాలు” అని తెలిపారు. ఇంకా ఈ కార్యక్రమంలో చాంబర్ కోశాధికారి టీ రామ సత్యనారాయణ, నిర్మాత సాయి వెంకట్, జె వీ మోహన్ గౌడ్, జి వి కె తదితరులు పాల్గున్నారు.
Tags:Roshini Care of East Room Audio Release

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *