రోటరీక్లబ్‌ ద్వారా విశిష్ఠ సేవలందిస్తాం

Rotary Club offers excellent service

Rotary Club offers excellent service

Date:15/07/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు రోటరీక్లబ్‌ నూతన కార్యవర్గ కమిటి పదవి స్వీకారం చేశారు. ఆదివారం రాత్రి పట్టణంలో జరిగిన కార్యక్రమంలో రోటరీక్లబ్‌ నూతన అధ్యక్షుడుగా కె.సురేష్‌, కార్యదర్శిగా ఆవుల హరిప్రసాద్‌తో పాటు కార్యవర్గ కమిటి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా నూతన కమిటి కార్యదర్శి హరిప్రసాద్‌ మాట్లాడుతూ రోటరీక్లబ్‌ ద్వారా విశిష్ఠ సేవలందిస్తామన్నారు. గ్రామీణ ప్రాంతాలలోని సమస్యలను గుర్తించి, పరిష్కరించేందుకు క్లబ్‌ద్వారా చర్యలు తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో రోటరీ ప్రతినిధులుజాన్‌ , జి.సుబాష్‌రెడ్డి, డాక్టర్‌ విజయకుమారి, డాక్టర్‌ ప్రబాకర్‌, పి.త్యాగరాజు, డాక్టర్‌ శణర్‌కుమార్‌, సిఎస్‌.రాజారెడ్డి, అనిల్‌, రమేష్‌, మధుసూదనరెడ్డి, సుధాకర్‌రెడ్డి, మెయినుద్దిన్‌, ప్రవీన్‌కుమార్‌, డాక్టర్‌ హరగోపాల్‌, బాస్కర్‌, సత్యనారాయణ, గోపాల్‌, క్రిష్ణకుమార్‌లు పాల్గొన్నారు.

దళిత సంఘంచే ఎంపీడీవో, తహశీల్ధార్‌లకు సన్మానం

Tags: Rotary Club offers excellent service

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *