Natyam ad

మార్చి 2న రోటరీ కంటి శిబిరం

పుంగనూరు ముచ్చట్లు:

పట్టణంలోని రోటరీక్లబ్‌ ఆధ్వర్యంలో మార్చి2న బిఎంఎస్‌క్లబ్‌లో కంటి వైద్యశిబిరం నిర్వహిస్తున్నట్లు అధ్యక్ష, కార్యదర్శులు అనిల్‌కుమార్‌, రాజారెడ్డి తెలిపారు. గురువారం ఈ మేరకు కరపత్రాలను విడుదల చేశారు. రాజారెడ్డి మాట్లాడుతూ జిల్లా అంధత్వనివారణ సంస్థతో కలసి వైద్యశిబిరాన్ని బెంగళూరుకు చెందిన శంకర్‌నేత్రాల వారిచే నిర్వహిస్తున్నట్లు తెలిపారు. చికిత్సలు చేసి, అవసరమైన వారికి ఆపరేషన్లు చేసి, కంటి అద్దాలు పంపిణీ చేయనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సభ్యులు త్యాగరాజు, గణేష్‌, భాస్కర్‌, భాస్కర్‌జెట్టి, మునిరాజ, భాస్కర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags:Rotary eye camp on March 2

Post Midle