పుంగనూరులో రోటరీ సేవలు విస్తతం చేస్తాం
పుంగనూరు ముచ్చట్లు:
రోటరీక్లబ్ ద్వారా సేవలను మరింతగా నిర్వహించి, ప్రజలకు సేవలు అందిస్తామని రోటరీక్లబ్ గవర్నర్ జితేంద్రఅనేస్త్ర అన్నారు. ఆదివారం పట్టణంలో రోటరీక్లబ్ సమావేశాన్ని అధ్యక్షుడు కిషోర్, కార్యదర్శి సుధాకర్ నిర్వహించారు. గవర్నర్ మాట్లాడుతూ రోటరీక్లబ్ ద్వారా ప్రజలకు అవసరమైన సహాయాన్ని గుర్తించి అందిస్తామన్నారు. ఈ మేరకు ప్రణాళికలు సిద్దం చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో జోనల్ సెక్రటరీ రవీంద్రనాథ్, అసిస్టెంట్ గవర్నర్ వెంకట్రమణ, స్థానిక ప్రతినిధులు డాక్టర్ శరణ్, రాజారెడ్డి, అనిల్, నాగిరెడ్డి, వేణు, గణేష్, భాస్కర్, ప్రవీన్ తదితరులు పాల్గొన్నారు.

Tags: Rotary services will be spread in Punganur
