టర్కీ ఎఫెక్ట్ తో  పడిపొయిన రూ‘పోయె‘

Date:14/08/2018
ముంబై ముచ్చట్లు:
డాల‌ర్‌తో రూపాయి విలువ ఇవాళ కూడా మ‌రింత ప‌త‌న‌మైంది. మార్కెట్ చ‌రిత్ర‌లో తొలిసారి డాల‌ర్‌తో రూపాయి విలువ 70.1గా న‌మోదు అయ్యింది. ఈ ఏడాదిలోనే రూపాయి విలువ 10 శాతం ప‌డిపోయింది. సోమ‌వారం మార్కెట్ల‌లో రూపాయి విలువ 69.91 వ‌ద్ద నిలిచిపోయింది. అయితే అక్క‌డ నుంచి మొద‌లైన ట్రేడింగ్ ఇవాళ ఉద‌యం ఆరంభంలో కొంత మెరుగుప‌డింది.
23 పైస‌లు కోలుకుని 69.28 వ‌ద్ద కొద్ది సేపు నిలిచింది. ట‌ర్కీ క‌రెన్సీ లీరా ప్ర‌కంప‌న‌లు ద‌లాల్ స్ట్రీట్‌ను తాక‌డంతో రూపాయి విలువ మ‌ళ్లీ ప‌త‌న‌మైంది. ఉద‌యం 10.30 గంట‌ల స‌మ‌యంలో.. డాల‌ర్ విలువ 70.07గా న‌మోదు అయ్యింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ జీవితకాల కనీస స్థాయికి పతనం అయింది.
సోమవారం ఒక్క రోజులోనే రూ.1.10 లేదా 1.57 శాతం నష్టపోయి రూ.69.93 వద్ద ముగిసింది. ఆగస్టు 2103 తర్వాత ఒక రోజులో జరిగిన గరిష్ఠ పతనం ఇదే. అప్పుడు ఒకే రోజు రూ. 1.48 లేదా 2.4 శాతం నష్టపోయింది. టర్కీ ఆర్థిక సంక్షోభం ప్రపంచ ఆర్థికవ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపించనుందన్న అంచనాలతో వివిధ దేశాల కరెన్సీలు కూడా పతనం అయ్యాయి. లీరా క్షీణత కారణంగా రూపా యి కూడా దిగజారిందని ప్రభుత్వ రంగ బ్యాంకు ట్రెజరర్ ఒకరు అభిప్రాయపడ్డారు.
వీటికి తోడు విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్ల నుంచి పెట్టుబడులు తగ్గడంతో పాటు చము రు ధరల ప్రభావం కూ డా రూపాయిపై ప్రభా వం పడిందని అన్నా రు. ప్రస్తుత మారకం విలువ మరింత పతనం కాకుండా రిజర్వ్‌బ్యాంక్ చర్యలు తీసుకుంటుందని మరో సీనియర్ ట్రెజరీ అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. సోమ వారం నాడు ప్రారంభంలో రూపాయి విలువ 41 పైసలు పెరిగినప్పటికీ ఆ తర్వాత డాలర్లకు డిమాండ్ భారీగా పెరగడంతో రూపాయి విలువ గణనీయంగా పతనం అయి చివరికి రూ.69.91 వద్ద ముగిసింది.
Tags:Rounded with Turkey Effect

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *