జూలై 15న  రౌడీ  బ్రాండ్

Rowdy brand on July 15

Rowdy brand on July 15

Date:13/07/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
యువ హీరో విజయ దేవరకొండ షర్ట్ లేకుండా ఇలా బస్టాండ్‌లో నిల్చున్నాడు. ఇదేదో సినిమా షూటింగ్ కోసమో, సినిమా ప్రమోషన్ కోసమే అనుకుంటే పొరపాటే. దీని వెనుక ఓ కారణం ఉంది. కొద్ది రోజులుగా విజయ్ దేవరకొండకు షర్ట్ దొరకడం లేదంట. అందుకని ఇలా షర్ట్ లేకుండా తిరుగుతున్నాడు. బైకు మీద కూడా ఇలాగే షర్ట్ లేకుండా ‘రౌడీ’లా దూసుకెళ్తున్నాడు. విజయ్ దేవరకొండ‌కు షర్ట్ దొరక్కపోడం ఏమిటీ? అతడు తలచుకుంటే బట్టల షాపే వస్తుంది’’ అని అనుకుంటున్నారా? ఔను అది నిజమే. త్వరలోనే బట్టల షాపు రానుంది. అది మరెవ్వరిదో కాదు.. విజయ్ దేవరకొండదే. ఆ బ్రాండ్ పేరు ‘రౌడీ’. జులై 15న ఈ బ్రాండ్ లాంచ్ కానుంది. తన బ్రాండ్‌కు తానే అంబాసిడర్‌గా విజయ్ ఇలా షర్ట్ లేకుండా ఆకట్టుకుంటున్నాడు. తన బ్రాండ్ ప్రమోషన్ కోసం విజయ్.. ‘రౌడీ క్లబ్’ అనే వెబ్‌సైట్ కూడా ప్రారంభించాడు. తన అభిమానులను అందులో చేరాలని కోరుతున్నాడు. బ్రాండ్ ప్రారంభోత్సవం రోజున వీరిలో కొందరిని విజయ్ ఆహ్వానించనున్నాడని తెలిసింది. విజయ్ ప్రస్తుతం అర్జున్ ‘ట్యాక్సీవాలా’, ‘నోటా’, ‘గీతా గోవిందం’, ‘డియర్ కామ్రేడ్’ చిత్రాల్లో నటిస్తున్నాడు.
 జూలై 15న  రౌడీ  బ్రాండ్ https://www.telugumuchatlu.com/rowdy-brand-on-july-15/
Tags:Rowdy brand on July 15

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *