విజయనగరంలో రౌడీ రాజ్యం

Date:14/07/2020

విజయవాడ ముచ్చట్లు:

విజయనగరం పట్టణంలోని బీజెపి కార్పొరేటర్ అభ్యర్థి ,పార్టీ జిల్లా నాయకుడు,నారాయణరావుని రాజకీయంగా ఎదిరించలేక అత్యంత దారుణంగా హత్యా ప్రయత్నం చేయడం సిగ్గుచేటు. ఈసంఘటను భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిస్తోందని బీజేపీ రాష్ట్రాఉపాధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. మంగళవారం అయన మీడియాతో మాట్లాడారు. ఇలాంటి సంఘటనలతో బీజెపి నాయకులు ,కార్యకర్తల ఆత్మస్థైర్యం దెబ్బతీయలేవు..! ఇది పూర్తిగా పిరికిపంద చర్య. విజయనగరంలో వైయస్సార్సీపి నేతలు కోందరు గుండాలలాగ హత్య రాజకీయాలకు పాల్పడుతున్నారు. విజయనగరంలో జల్లాలో రౌడీ రాజ్యం నడుస్తుంది అని చెప్పడానికి ఇంతకన్నా నిదర్శనం ఎం కావాలని ప్రశ్నించారు. ఈ సంఘటన మీద రాష్ట్రడిజిపీ తక్షణం చర్యలు తీసుకోవాలి బాధితకుటుంభానికి రక్షణ కల్పించాలిని బిజెపి డిమాండ్ చేస్తుందని అన్నారు.

కుంటిసాకులతో రావడంలేదు

Tags: Rowdy kingdom in Vijayanagar

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *