108 అంబులెన్స్‌ను దగ్ధం చేసిన రౌడీషీటర్

Date:16/09/2020

ఒంగోలు  ముచ్చట్లు:

ప్రకాశం జిల్లా ఒంగోలులో ఓ రౌడీ షీటర్ రెచ్చిపోయాడు. 108 వాహనానికి నిప్పు పెట్టాడు. సురేష్ అనే మాజీ రౌడీషీటర్ 108కు పదే పదే రాంగ్ కాల్స్ చేస్తుండటంతో సిబ్బంది ఫిర్యాదు మేరకు విచారణ నిమిత్తం తాలూకా పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారు. అతడు పోలీస్టేషన్ కార్యాలయ అద్దాలు పగలగొట్టడంతో చేతికి తీవ్రగాయాలు కావడంతో అతని మానసిక పరిస్థితి బాగాలేదని భావించారు. ఆ తర్వాత అతడ్ని తీసుకెళ్లేందుకు 108 కాల్ సెంటర్‌కు పోలీసులు ఫోన్ చేశారు.అనంతరం 108 వాహనం ఎక్కిన సురేష్ వెంటనే వాహనం అద్దాలు పగులగొట్టి అందులో ఉన్న స్పిరిట్‌తో అంబులెన్స్‌ను తగులబెట్టాడు. దగ్ధమవుతున్న 108 వాహనంలోనే నిందితుడు ఉండటంతో బయటకు రమ్మన్ని పోలీసులు హెచ్చరించారు. ఐనా బయటకు రాకండా విచిత్రంగా ప్రవర్తించడంతో  చాకచక్యంగా అతడిని బయటకు లాగేశారు. అయితే, వారి కళ్లుగప్పి సురేష్‌ పరారయ్యాడు. గత నాలుగు రోజులుగా నిందితుడి మానసిక పరిస్థితి బాగోలేక స్టేషన్‌లో పిచ్చిపిచ్చిగా మాట్లాడు తున్నాడని పోలీసులు చెప్తున్నారు. అతన్ని కోవిడ్‌ అనుమాతుడిగా భావిస్తున్నామని వెల్లడించారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకుంటామని తెలిపారు. కాగా, మంటల ధాటికి అంబులెన్స్‌ పూర్తిగా కాలి బూడిదైంది.

మందిరాల్లో సీసీ కెమెరాలు అమర్చుకోండి        

Tags: Rowdysheeter who burned 108 ambulance

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *