కుల వృత్తులకు రూ.1,000 కోట్లతో చేయూత: తలసాని

Date:21/01/2021

కరీంనగర్  ముచ్చట్లు:

గంగ పుత్రుల రక్షణకు ప్రభుత్వం కట్టుబడి ఉంది. గంగపుత్రుల సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. జిల్లాలోని తిమ్మాపూర్ మండలం ఎల్ ఎండీ ఎస్సారెస్పీ అతిథి గృహంలో మంత్రి గంగుల కమలాకర్, మేయర్ సునీల్ రావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. కుల వృత్తులకు రూ.1,000 కోట్లతో చేయూతనిస్తున్నామని తెలిపారు. గంగపుత్ర భవన్‌కు త్వరలో శంకుస్థాపన చేస్తామన్నారు. గంగపుత్రులు ఎవరు ఆందోళన చెందవద్దు. నా మాటలను తప్పుగా అర్థం చేసుకోవద్దన్నారు. వెనుక బడిన కులాలందరికి త్వరలో ఆత్మగౌరవ భవనాలు నిర్మిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం జలాలతో తెలంగాణ పచ్చగా మారింది.
దేశ చరిత్రలో రైతుబంధు, రైతు భీమా అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వాన్ని బీజేపీ విమర్శించడం సిగ్గుచేటు మండిపడ్డారు. కాళేశ్వరంకు జాతీయ హోదా అడిగితే ఇవ్వలేదు. కేంద్రం తెలంగాణలో చేసిన అభివృద్ధిపై శ్వేతపత్రం విడుదల చేయాలని మంత్రి తలసాని డిమాండ్‌ చేశారు. మంత్రి గంగుల కమలాకర్ మాట్లాడుతూ..తండ్రికి తగ్గ తనయుడు కేటీఆర్. అన్నారు. సీఎంగా కేటీఆర్‌కు అన్ని అర్హతలు ఉన్నాయన్నారు. మా అధినేత కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానిని అన్ని విధాల స్వాగతిస్తామని పేర్కొన్నారు. సీఎం అంశం మా పార్టీ అంతర్గత విషయమన్నారు. ఐటీ మినిస్టర్‌గా కేటీఆర్ తెలంగాణకు అనేక ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌లు తెచ్చి తన ప్రతిభను నిరూపించుకున్నారని తెలిపారు.

పుంగనూరులో జగనన్న కాలనీలో లబ్ధిదారులకు పట్టాలపై పరిశీలన

Tags: Rs 1,000 crore for caste-based professions: Talasani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *