రూ. 15 లక్షలు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు అందజేత

Rs. 15 lakh CM Relief Funds will be handed over to checks

Rs. 15 lakh CM Relief Funds will be handed over to checks

Date:12/03/2018

పలమనేరు ముచ్చట్లు:

ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను రాష్ట్ర మంత్రి అమరనాథ్ రెడ్డి సతీమణి రేణుకారెడ్డి లబ్ధిదారులకు అందజేశారు. స్థానిక తెదేపా కార్యాలయంలో సోమవారం ఏర్పాటు చేసిన లబ్దిదారుల సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె సుమారు రూ. 15 లక్షల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపిణీ చేశారు. వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో భాదపడుతున్న ఆర్థికంగా వెనుకబడిన పేదలకు సీఎం రిలీఫ్ ఫండ్ ఎంతో ఆసరగా నిలుస్తోందని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో తెదేపా జిల్లా కోశాధికారి ఆర్వీబాలాజి, బైరెడ్డిపల్లె, గంగవరం, పెద్దపంజాణి మండల అధ్యక్షులు, నాయకులు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Tags: Rs. 15 lakh CM Relief Funds will be handed over to checks

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *