Natyam ad

పుదిపట్ల బ్రాంచ్‌ పోస్టాఫీసులో సేవింగ్‌ఖాతాలలో రూ.16 లక్షలు స్వాహా ..?-సబ్‌పోస్ట్మాస్టర్‌పై వేటు

– రహస్యంగా విచారణలు
– లబోదిబోమంటున్న బాధితులు

 

చౌడేపల్లె ముచ్చట్లు:

Post Midle

చౌడేపల్లె మండలం పుదిపట్ల బ్రాంచ్‌పోస్టాఫీసులో ప్రజలు పొదుపు చేసుకున్న ఖాతాల డబ్బు సుమారు రూ.16 లక్షల రూపాయలు స్వాహా కాబడిందని ఆరోపణలు రావడంతో పోస్టల్‌ అధికారులు రహస్యంగా విచారణ చేసి దీనిని వెలుగులోనికి రానివ్వకుండ దాచిన వైనం  బయట పెట్టింది. వివరాలిలా ఉన్నాయి. పుదిపట్ల బ్రాంచ్‌పోస్టాఫీసు పరిధిలోని ప్రజలు ప్రతి నెల వారి శక్తి మేరకు పోస్టాఫీసులో రకరకాల పొదుపులు చేస్తారు. ఇలా ఉండగా ప్రతి నెల అక్కడ బ్రాంచ్‌పోస్ట్మాస్టర్‌గా ఉన్న దేవిక అనే మహిళకు డబ్బులు చెల్లిస్తారు. ఆమె నిబంధనల మేరకు డబ్బులు తీసుకున్న వెంటనే ఖాతా పుస్తకంలో నగదు నమోదు చేసి , సీలు వేసి , సంతకం చేసి ఖాతా బుక్కులు ప్రజలకు ఇవ్వాలి. కానీ ఇక్కడ ఇందుకు విరుద్ధంగా ప్రజల నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసి బ్రాంచ్‌పోస్ట్మాస్టర్‌ పుస్తకాలలో నమోదు చేయకుండ స్వాహా చేసినట్లు ఆరోపణలు వెలుగుచూసింది. గత నెలలో ఈ స్వాహా తంతు వెలుగుచూడటంతో పోస్టల్‌ అధికారులు గుట్టుచప్పుడు కాకుండ విచారణ చేసి, బ్రాంచ్‌పోస్ట్మాస్టర్‌ గా ఉన్న దేవిక అనే మహిళను విధుల నుంచి తప్పించారు. ఆమె స్థానంలో వేరోకరిని నియమించారు. ప్రజల వద్ద వసూలు చేసిన డబ్బులు తిరిగి వారికి తక్షణమే వారికి చెల్లించాలని దేవిక కి ఆదేశాలు జారీ చేశారు. ఇలా ఉండగా నెల రోజులు గడుస్తున్న డబ్బులు పూర్తిగా ఇవ్వకుండ కొంత డబ్బులు మాత్రమే చెల్లిస్తుండటంతో బాధితులు ఘర్షణలకు దిగడంతో ఈ సంఘటన వెలుగుచూసింది. సుమారు రూ.16 లక్షలు స్వాహా అయినట్లు చర్చజరుగుతోంది. నిజానిజాలు అధికారుల విచారణలో వెల్లడికావాల్సి ఉంది. ఈ విషయమై పోస్టల్‌ ఇన్‌స్పెక్టర్‌ సతీష్‌ను  వివరణ కోరగా ఆయన ఈ సంఘటన వాస్తవమేనన్నారు. దీనిపై విచారణ చేస్తున్నామని, బ్రాంచ్‌పోస్ట్మాస్టర్‌ దేవిక ని విధుల నుంచి తప్పించామని తెలిపారు. ప్రజలు ఆమెకు డబ్బులు ఇచ్చినట్లు ఆధారాలు లేవన్నారు. రూ.50 వేలు మాత్రం ఆధారాలు లభించిందన్నారు. బాధితులు ఎవరైనా తమకు ఫిర్యాదు చేస్తే వారి డబ్బులు చెల్లించేలా చర్యలు తీసుకుంటామన్నారు. అలాగే దేవిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశామని, చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఈ విషయమై దేవిక ని విచారించగా అలాంటి అక్రమాలు ఏమి జరగలేదని , ఇది వాస్తవం కాదన్నారు.

 

బిపిఎం కార్యాలయాలలో ఆరోపణలు…

గ్రామీణ ప్రాంతాలలో ఏర్పాటు చేసిన బ్రాంచ్‌పోస్టాఫీసులపై అధికారుల పర్యవేక్షణ తూతూమంత్రంగా సాగడంతో ఖాతాల నిధుల స్వాహా ఆరోపణలు తరచుగా వస్తున్నాయి. బ్రాంచ్‌ పోస్ట్మాస్టర్లు కొంత మంది ప్రజల ఖాతా పుస్తకాలు ఇళ్లలో పెట్టుకుని పెత్తనం చెలాయిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే ఖాతాదారులు ఇచ్చే డబ్బులు తమ అవసరాలకు వాడుకోవడం, అడిగితే డబ్బులు ఇవ్వడం, లేకపోతే ఖాతాలో ఉందని చెప్పడం సర్వసాధారణమైంది. వీటిపై అధికారుల విచారణలు సక్రమంగా లేకపోవడంతో ఇలాంటివి అక్రమాలు చోటు చేసుకుంటున్నాయి. దీనిపై జిల్లా పోస్టల్‌ సూపరింటెండెంట్‌ వెంటనే చర్యలు తీసుకుని , బిపిఎంలలో జరుగుతున్న అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు.

 

Tags: Rs.16 lakhs in savings accounts in Pudipatla branch post office ..?- Subpostmaster

Post Midle