Rs 170 crore guarantee for Tamballapalle

తంబళ్లపల్లెకు రూ.170 కోట్ల భరోసా

-4,731 మహిళా సంఘాలకు ఆర్థిక చేయూత
-మహిళా పక్షపాతి సీఎం
-ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి

Date:19/09/2020

తంబళ్లపల్లె ముచ్చట్లు:

మహిళలకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశ్యంతోనే సీఎం వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి వైఎస్సార్‌ భరోసా పథకాన్ని అమలు చేస్తున్నారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అన్నారు. భరోసా వారోత్సవాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ఏ పథకం చేపట్టినా, ఏ కార్యక్రమం అమలు చేసినా ప్రజాసంక్షేమం కోసమేనని అన్నారు. మహిళా సంఘాల సభ్యులకు ఆర్థికంగా చేయూతనిచ్చి అండగా నిలిచేందుకు అమలు చేసిన వైఎస్సార్‌ భరోసా ద్వారా తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మహిళలకు రూ.170.32కోట్ల లబ్ది చేకూరుతోందని అన్నారు. 4,731 సంఘాల్లోని సభ్యులకు తొలి విడతలో రూ.42.38కోట్లు వారి ఖాతాలకు జమ అవుతోందని చెప్పారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట మేరకు 2019 ఏప్రిల్‌ నుంచి సంఘాలు ఏ రుణం పెండింగ్‌లో ఉందో అంతే రుణాన్ని ప్రభుత్వం తిరిగి మహిళలకే చెల్లిస్తోందని చెప్పారు. మరో మూడు విడతల్లో నగదు ఖాతాలకు జమ అవుతుందని చెప్పారు. మహిళలకు ఎన్నో పథకాల ద్వారా ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకుంటోందని చెప్పారు. ప్రతి వర్గం ఆర్థికంగా ఎదగాలని తపనపడుతూ ఆదుకొంటున్న ఏకైక ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి ఒక్కరే అని అన్నారు. గతంలో ఏవరూ అమలు చేయని సంక్షేమ పథకాలను అమలు చేస్తూ చరిత్రలో నిలిచిపోతున్నారని అన్నారు. అన్ని ప్రాంతాల అభివృద్దికి, సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. నియోజకవర్గంలో ప్రజల సమస్యలు పరిష్కారం కోసం కృషి చేస్తున్నామని, సమస్యలులేని ప్రాంతంగా తీర్చిదిద్దే చర్యలు తీసుకొంటున్నామని చెప్పారు. ప్రజల చెంతకే ప్రభుత్వ కార్యాలయాలు ఉండాలన్న లక్ష్యంతో మదనపల్లెలోని కార్యాలయాల తరలింపు చేట్టామన్నారు. మండలకేంద్రాల్లో సమస్యల గుర్తింపు, అభివృద్దికి చర్యలు తీసుకొంటున్నట్టు చెప్పారు.

ఇంకా ఎంత మంది బలి కావాలి..

Tags: Rs 170 crore guarantee for Tamballapalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *