Rs. 2.49 crore for protected drinking water schemes in Punganur constituency

పుంగనూరు నియోజకవర్గంలో రక్షిత మంచినీటి పథకాలకు రూ.27.49 కోట్లు

– నీటి సమస్య తీర్చేందుకు మంత్రి పెద్దిరెడ్డి శ్రీకారం

Date:21/01/2020

పుంగనూరు ముచ్చట్లు:

పది సంవత్సరాలుగా తీవ్ర మంచినీటి సమస్యతో సతమతమౌతున్న పుంగనూరు నియోజకవర్గ ప్రజల దాహార్తి తీర్చేందుకు రాష్ట్ర పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ.27.49 కోట్లు మంజూరు చేశారు. ఈ మేరకు పంచాయతీరాజ్‌ సెక్రటరీ గోపాలకృష్ణద్వివేది ఉత్తర్వులు జారీ చేశారు. మంజూరు కాబడిన గ్రామాల్లో మంచినీటి ఓవర్‌హెడ్‌ ట్యాంకులు నిర్మించి, బోర్లు వేసి ప్రజలకు నీటిని సరఫరా చేసేలా చర్యలు చేపట్టారు. ఈ విషయమై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలాల వారిగా ట్యాంకులు నిర్మించనున్న గ్రామాల వివరాలు…

పుంగనూరు మండలంలో 27 గ్రామాలలో రూ.4.83 కోట్లతో రక్షిత మంచినీటి పథకాలు నిర్మించనున్నారు. అలాగే చౌడేపల్లె మండలంలో 20 గ్రామాలలో రూ.3.46 కోట్లతో , సోమల మండలంలోని 19 గ్రామాలలో రూ.3.42 కోట్లు, సదుంలో 31 గ్రామాలలో రూ.5.09 కోట్లు, పులిచెర్లలోని 36 గ్రామాలలో రూ,5.48 కోట్లు, రొంపిచెర్లలోని 27 గ్రామాలలో రూ.5.21 కోట్లతో పథకాలు ఏర్పాటు చేయనున్నారు. త్వరలోనే ఈ పనులు చేపట్టాలని మంత్రి పెద్దిరెడ్డి ఆర్‌డబ్యూజ్లిఎస్‌ అధికారులను ఆదేశించారు. ఈ మేరకు పనులు ప్రారంభించనున్నారు.

గ్రుడు ఉడకలేదు – టమోటా దొరకలేదు

Tags: Rs. 2.49 crore for protected drinking water schemes in Punganur constituency

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *