Minister Peddi Reddy who handed over the checks to the Chief Minister

సీఎం జగన్‌కు రూ.200.11 కోట్లు విరాళం చెక్కును అందజేసిన మంత్రి పెద్దిరెడ్డి

Date:02/04/2020

అమరావతి ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డికి రూ.200.11 కోట్ల రూపాయల చెక్కులను పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి , గనులశాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అందజేశారు. ముఖ్యమంత్రి నివాసంలో ఆయన తన శాఖల ద్వారా సేకరించిన విరాళాల చెక్కులను పంచాయతీరాజ్‌ కార్యదర్శి గోపాలక్రిష్ణ ద్వివేది, మైనింగ్‌శాఖ కార్యదర్శి రాంగోపాల్‌, సెర్ఫ్ సీఈవో రాజబాబు, ఏపిఎండీసీ మదుసూదనరెడ్డి, డీజెఎం వెంకటరెడ్డితో కలసి ముఖ్యమంత్రిని కలసి మైనింగ్‌ ఫండ్‌ నుంచి రూ.187 కోట్లు, మైన్స్అండ్‌ జియాలజి ఉద్యోగుల విరాళం రూ.56 లక్షలు, ఉపాధిహామి ఉద్యోగుల విరాళం రూ.1.50 కోట్లు, సెర్ఫ్ ఉద్యోగుల విరాళం రూ.50 లక్షలు కలిపి రూ.200.11 కోట్లు అందజేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి , పెద్దిరెడ్డిని, ఆయాశాఖల కార్యదర్శులను, అధికారులను, సిబ్బందిని అభినందించారు.

ఉడుతాభక్తి సాయం…

కరోనాను నియంత్రించేందుకు మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ఉపాధిహామి ఉద్యోగులు రూ.1.50 కోట్లు విరాళంగా ఇచ్చి ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి ఉడుతాభక్తి సాయంగా అందించామని ఉపాధిహామి పథకం రాష్ట్రకౌన్సిలర్‌ ముత్యంశెట్టి విశ్వనాథ్‌ తెలిపారు. ఉపాధిహామి కూలీలకు ఎంజిఎన్‌ఆర్‌ ఈజిఎస్‌ క్రింద రూ.211 నుంచి రూ.237లకు పెంచిన ఘనత ఎంపీ మిధున్‌రెడ్డి, మంత్రి పెద్దిరెడ్డికి దక్కిందని కొనియాడారు. ముఖ్యంగా కరోనాను నియంత్రించేందుకు ప్రతి ఒక్కరు స్వీయ నియంత్రణ పాటిస్తూ భౌతికదూరం పాటించాలన్నారు. బయట తిరగకుండ ఇండ్లలో ఉండాలని పిలుపునిచ్చారు. వ్యాధిని నియంత్రించేందుకు ప్రభుత్వము, పోలీస్‌, రెవెన్యూ, వైద్య, మున్సిపల్‌ అధికారులు , కార్మికులు , సచివాలయ ఉద్యోగులు , వలంటీర్లు చేస్తున్న కృషి మరువలేనిదని కొనియాడారు. రాష్ట్రంలో ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో సచివాలయ వ్యవస్థ ఎంతగానో ఉపయోగపడుతోందని , ఇలాంటి వ్యవస్థను ఏర్పాటు చేసిన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి , పంచాయతీరాజ్‌శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

 

30 వేల శానిటైజర్ లను మంత్రి అనిల్ కు అందజేసిన వ్యాపార సంఘాలు

Tags: Rs 200.11 crore donation check to CM Pagan

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *