Date:24/01/2021
తిరుమలముచ్చట్లు:
శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్లో ధార్మిక, భక్తిప్రచార కార్యక్రమాలు ప్రసారం చేసేందుకు గాను స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 26 లక్షలా 98 వేలా 70 రూపాయలు స్పాన్సర్షిప్ అందించింది.బ్యాంకు ఎండి చల్లా శ్రీనివాసులు చెట్టి ఈ స్పాన్సర్షిప్ మొత్తం డిడిని ఆదివారం తిరుమలలోని క్యాంపు కార్యాలయంలో టిటిడి అదనపు ఈవో మరియు ఎస్వీబీసీ ఎండి ఎవి.ధర్మారెడ్డికి అందజేశారు.ఈ కార్యక్రమంలో ఎస్బిఐ అమరావతి సర్కిల్ సిజిఎం సంజయ్ సహాయ్, జనరల్ మేనేజర్ వినిత భట్టాచార్జీ, తిరుపతి డిజిఎం ఎస్.గిరిధర్, రీజనల్ మేనేజర్ ఎస్.సత్యనారాయణ, తిరుమల శాఖ మేనేజర్ సిహెచ్విఎస్.ప్రసాదరావు పాల్గొన్నారు.
శ్రీవారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందరరాజన్
Tags: Rs 26 lakh sponsorship for broadcasting charitable activities on SVBC