Rs. 27.49 crores released

పుంగనూరులో మంచినీటి సమస్య తీర్చేందుకు రూ. 27.49 కోట్లు విడుదల

– మంత్రి పెద్దిరెడ్డి సహకారంతో జీవో విడుదల

Date:14/02/2020

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నియోజకవర్గంలోని మంచినీటి సమస్య తీర్చేందుకు, అలాగే శానిటేషన్‌ కార్యక్రమాలను చేపట్టేందుకు రూ.27.49 కోట్లు విడుదల చేస్తూ శుక్రవారం సాయంత్రం పంచాయతీరాజ్‌శాఖ ప్య్రధాన కార్యదర్శి గోపాలకృష్ణ ద్వివేది ఈ మేరకు రూ.2,749 లక్షలు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. నియోజకవర్గంలోని పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచెర్ల మండలాల్లో మంచినీటి ట్యాంకులు, కాలువలు, పైపులైన్లు , బోర్లు వేసేందుకు ప్రతిపాదనలను అధికారులు తయారు చేసి, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అందజేశారు. దీనిపై మంత్రి ఎన్‌ఆర్‌డిడబ్యూజ్లిపీ పథకం క్రింద నియోజకవర్గంలో 160 పనులను చేపట్టేలా పంచాయతీరాజ్‌ ప్రధాన కార్యదర్శి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పనులను చేపట్టేందుకు మండలాల వారిగా షార్ట్ టెండర్లను పిలిచి, సింగిల్‌ ప్యాకేజ్‌లో పనులను చేపట్టేందుకు అనుమతులు మంజూరు చేశారు. వేసవిలో మంచినీటి సమస్య తీర్చేందుకు మంత్రి చేపట్టిన చర్యలపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ధ్వజారోహణంతో వైభ‌వంగా శ్రీకపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం

Tags: Rs. 27.49 crores released

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *