సీఎం చంద్రబాబునాయుడు బ్రాహ్మణ కార్పోరేషన్‌కు రూ.290 కోట్లు కేటాయించాలి

Rs 290 crores to CM Chandrababu Naidu Brahmin Corporation

Rs 290 crores to CM Chandrababu Naidu Brahmin Corporation

– కార్పోరేషన్‌ చైర్మన్‌ హద్దులుదాటితే సహించం
– బ్రాహ్మణ సంఘ నేతలు శ్రీకాంత్‌, సతీష్‌, దీప్తి

Date:25/02/2018

మంగళగిరి ముచ్చట్లు:

రాష్ట్ర ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు బ్రాహ్మణులకు బడ్జెట్‌లో రూ.290 కోట్లు కేటాయించాలని ఆంధప్రదేశ్‌ బ్రాహ్మణ సంఘ అధ్యక్షుడు జ్వాలాపురం శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి కోసూరు సతీష్‌శర్మ, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు రెంట చింతలదీప్తి కలసి డిమాండు చేశారు. మంగళగిరిలో బ్రాహ్మణ సంఘ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీకాంత్‌ మాట్లాడుతూ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఆనందసూర్య ఏకపక్ష నిర్ణయాలతో బ్రాహ్మణులను తప్పుదావ పట్టిస్తున్నారని ఆరోపించారు. కార్పోరేషన్‌ చైర్మన్‌ బ్రాహ్మణ సంఘాలను, ఐవైఆర్‌.క్రిష్ణారావు ద్వారా 48 వేల మందికి లబ్ధిచేకూరిందన్నారు. అలాంటి ఐవైఆర్‌ను గుంటూరులో విమర్శించడం బాధరకరమన్నారు. ఆనందసూర్యకు బ్రాహ్మణ సంఘాలను విమర్శించే అర్హత,స్థాయి లేదన్నారు. అలాగే బ్రాహ్మణులెవ్వరు రాష్ట్రంలో ఆనందసూర్యను ఆహ్వానించడం లేదని తెలిపారు. ఆనందసూర్య పద్దతులు మార్చుకోకపోతే రాష్ట్ర బ్రాహ్మణులు ఏకమై తగిన గుణపాఠం నేర్పుతారని హెచ్చరించారు. సతీష్‌శర్మ మాట్లాడుతూ రాష్ట్ర కార్పోరేషన్‌ అభివృద్ధి చెందుతోందని కొనియాడారు. అలాంటి కార్పోరేషన్‌కు ఆనందసూర్య చైర్మన్‌గా రావడం బాధకరమన్నారు. ఆయనకు నైతికత లేదన్నారు. రాష్ట్రంలోని అర్చకులు, దయనీయస్థితిలో ఉంటూ , జీవోనెంబరు:76ను అమలు పరచాలని గొల్లపూడిలో సమావేశం నిర్వహించారని తెలిపారు. ఆ సమావేశానికి ఆనందసూర్య వెళ్లకపోవడం బాధకరమన్నారు. ఆయన అందరిని కలుపుకుపోవాలని లేకపోతే నెలరోజులలోపు చైర్మన్‌ పదవి పోతుందని తెలిపారు. ముఖ్యమంత్రి నిధులు కేటాయించి, ఆదర్శ ముఖ్యమంత్రిగా నిలవాలని కోరారు. మహిళా అధ్యక్షురాలు దీప్తి మాట్లాడుతూ కార్పోరేషన్‌ చైర్మన్‌ ఏకపక్ష నిర్ణయాలతో బ్రాహ్మణులకు తగిన ఆర్థిక సహాయం అందలేదన్నారు. ముఖ్యంగా మహిళలకు ఎలాంటి సహాయము అందకపోవడం బాధకరమన్నారు. మహిళలను అభివృద్ధి చేయకపోతే కార్పోరేషన్‌కు మనుగడ లేదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు మాచిరాజు రవి, కార్యనిర్వహక కార్యదర్శి రెంటచింతల మధు, కార్యదర్శి పొన్నపల్లి సోమశేఖర్‌, బ్రాహ్మణసంఘ నేతలు కరినాగలక్ష్మి, సోమసుందరశాస్మి, ప్రయాగక్రిష్ణ, వెళ్లంకి శేషావతి, చెరువుసౌజన్య, శ్రీవత్సవ, రఘు, రవీంద్రకుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Tags: Rs 290 crores to CM Chandrababu Naidu Brahmin Corporation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *