Rs. 4.30 crore for development of temples in Chowdepalle

రూ:4.30 కోట్లతోచౌడేపల్లెలో దేవాలయాల అభివృద్దికి స్వీకారం

– రెండు ఆలయాలకు ఆలయాలకు మహర్దశ
– పూర్వ వైభవం తేవడమే మంత్రి పెద్దిరెడ్డి లక్ష్యం
– త్వరలో పనులు ప్రారంభం

Date:13/08/2020

చౌడేపల్లె ముచ్చట్లు:

పురాతన దేవాలయాలకు ప్రసిద్ది గాంచిన చౌడేపల్లెలో దేవాలయాల అభివృద్ది కోసం మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వీకారం చుట్టారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి , జెడ్పిటీసీ సభ్యుడు దామోదరరాజు అన్నారు. గురువారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఎంపీపీ అభ్యర్థి రామమూర్తి, మాజీ ఎంపీపీలు రెడ్డిప్రకాష్‌, రుక్మిణమ్మ, మిద్దింటి శంకర్‌నారాయణలతో కలిసి విలేకరుల సమావేశం జరిగింది. ఈ సంధర్భంగా ఆయన మాట్లాడుతూ మండల కేంద్రంలోని శ్రీ అభీష్టద మృత్యుంజయేశ్వరస్వామి, వేణుగోపాలస్వామి ఆలయాల అభివృద్ది కోసం మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రూ:4.30 కోట్ల నిధులు మంజూరు చేయించారన్నారు. గతంలో ఈ రెండు ఆలయాల్లో చేపట్టబొయే పనులను మంత్రి పెద్దిరెడ్డి ఆదేశాల మేరకు దేవాదాయశాఖ ఉన్నతాధికారులు, స్థపతిలు పరిశీలించి ప్రభుత్వానికి నివేదిలిచ్చారన్నారు. ఈ నిధులతో చేపట్టబోయే పనులకు టెండర్‌ ప్రకియపూర్తి అయింది. ఈ నిధులతో పురాతన చరిత్రగల ఆలయాలైన రెండింటిని అత్యంత సుందరంగా,ఆదర్శంగాతీర్చిదిద్దడమే లక్ష్యంగా అవసరమైన పనులు,వసతుల ఏర్పాట్లు చేసేందుకు మాస్టర్‌ప్లాన్‌ లో రూపొందించిన మేరకు పనులు త్వరలో ప్రారంభించనున్నారు. ఈ ఆలయాలకోసం మంత్రి చొరవతో నిధులు మంజూచేయించారన్నారు. కొందరు నేతలు తమకు అనుకూలమైన పత్రికల్లో ఆలయాల అభివృద్ది తామే చేశామంటూ ప్రచారాలు చేసుకోవడం సమంజసం కాదన్నారు.ఈ సమావేశంలో నేతలు వెంకటరత్నం నాయుడు, రాజన్న, కళ్యాణ్‌ భరత్‌,రమేష్‌బాబు,రమణ తదితరులున్నారు.

108లో గర్భిణీ ప్రసవం

Tags: Rs. 4.30 crore for development of temples in Chowdepalle

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *