కరోనా బాధిత కుటుంబాలకు  రూ.5 లక్షల సబ్సిడీ లోన్

జగిత్యాల  ముచ్చట్లు:

కరోనా తో ఇంటి పెద్ద దిక్కు కోల్పోయిన బీసీ కుటుంబాలకు   రూ.5లక్షల సబ్సిడీ లోన్  స్మైల్ పథకం లో భాగంగా ఇవ్వనున్నట్లు  రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించడం పట్ల టీబీసీ జేఏసి రాష్ట్ర అధ్యక్షుడు హరి అశోక్ కుమార్ హర్షం వ్యక్తం చేశారు.శుక్రవారం జిల్లా సంఘ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మేరకు జారీ చేసిన సబ్సిడీ కొరకు దరఖాస్తు చేయడానికి వివరాలు బీసీ వర్గాల సమాచారం కోసం వివరించారు.ఇందులో 80 శాతం లోన్ (రూ.4 లక్షలు),20 శాతం సబ్సిడీ (రూ.లక్ష) ఉంటుందని,కరోనా తో 18 నుంచి 60 ఏండ్ల లోపు ఉన్న కుటుంబ పెద్ద చనిపోతే లోన్ కోసం సంబంధిత జిల్లా బీసీ సంక్షేమ అభివృద్ధి కార్యాలయంలో ఈ నెల 26 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని ,అయితే సమయం సరిపోనందున ఈ నెల 30 వరకు దరఖాస్తుల సమర్పణకు గడువు ఇవ్వాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు.ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ,మార్కెట్ డైరెక్టర్ బండారి విజయ్,జిల్లా యువజన జేఏసి అధ్యక్ష,కార్యదర్శులు,మున్సిపల్ కౌన్సిలర్లు కూసరి అనిల్ కుమార్,పంబాల రామ్ కుమార్ ,జేఏసి మహిళా అధ్యక్షురాలు కస్తూరి శ్రీమంజరి తదితరులు పాల్గొన్నారు.

 

పుంగనూరులో మారెమ్మకు ప్రత్యేక అలంకారం

Tags:Rs 5 lakh subsidized loan for corona affected families

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *