Natyam ad

తల్లుల ఖాతాల్లోకి రూ.703 కోట్ల జగనన్న విద్యా దీవెన నిధులు-పేదరికంతో చదువులు ఆగరాదన్నదే లక్ష్యం..

నాలుగేళ్లలో ఉన్నత విద్య కోసమే రూ. 14,912 కోట్ల ఖర్చు చేశాం.. సీఎం జగన్

 

తూర్పుగోదావరి  ముచ్చట్లు:

Post Midle

పేదరికం కారణంగా నా పేదల చదువులు ఎంత మాత్రం ఆగరాదన్న లక్ష్యంతో మన ప్రభుత్వం పనిచేస్తోందని సీఎం జగన్ పేర్కొన్నారు. ఉజ్వల భవిష్యత్తుకు చదువులే పునాది అని పేర్కొన్న సీఎం జగన్ ప్రతి ఒక్కరికీ నాణ్యమైన ఉన్నత చదువులు అందించడమే ధ్యేయంగా జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన పథకాలను ప్రతిష్టాత్మకంగా తీసుకుని అమలు చేస్తున్నట్లు వివరించారు. తూర్పు గోదావరి జిల్లా, కొవ్వూరు వేదికగా 2023 విద్యా సంవత్సరంలో జనవరి మార్చి త్రైమ్రాసికానికి సంబంధించి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ బటన్ నొక్కి నేరుగా విద్యార్థుల తల్లుల ఖాతాల్లో రూ. 703 కోట్ల నిధులను సీఎం జగన్ జమ చేశారు. ఈ సందర్భంగా కొవ్వూరులో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సీఎం జగన్ మాట్లాడుతూ గత నాలుగేళ్లలో కేవలం విద్యార్థుల ఉన్నత చదువుల కోసమే రూ. 14,912 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. గత టీడీపీ ప్రభుత్వం విద్యార్థులకు చెల్లించకుండా పెండింగ్ లో ఉంచిన రూ. 1,778 కోట్లను కూడా మన ప్రభుత్వంలో చెల్లించామని సీఎం జగన్ వివరించారు. రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌ లో మొదలైన చదువుల విప్లవం దేశానికి దశ దిశ చూపిస్తుందన్నారు. పిల్లల చదువులపై చేస్తున్న ఖర్చు మానవ వనరులపై చేస్తున్న పెట్టుబడి అని దీంతో రాష్ర్ట సర్వతోముఖాభివ`ద్ధి సాధ్యపడుతుందని సీఎం జగన్ పేర్కొన్నారు. పిల్లలు చదువుకుంటే భావితరాలు బాగుపడతాయని సమాజంలో వివక్ష పోవాలన్నా పేదరికం పోవాలన్నా చదవే గొప్ప అస్త్రంగా పనిచేస్తుందన్నారు. నా ఎస్సీలు, నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు, నా నిరుపేదలు సామాజికంగా ఎదిగి ఆర్థికంగా బలపడాలన్నదే తన లక్ష్యమని పేర్కొన్నారు.
నాడు-నేడు ద్వారా ప్రభుత్వ స్కూళ్ల రూపురేఖలు మారుస్తున్నామని దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య 30 లక్షల నుంచి 40 లక్షలకు పెరిగిందని సీఎం జగన్ వివరించారు. ఉన్నత విద్యలో నాణ్యత కోసం కరిక్యులమ్‌ ను జాబ్‌ ఓరియోంటెడ్‌గా ఉండేటట్లు తీర్చిదిద్దామన్నారు. దేశంలోనే తొలిసారిగా రాష్ర్టంలో నాలుగేళ్ల హానర్స్‌ కోర్స్‌ ను ప్రవేశపెట్టిన అంశాన్ని గుర్తు చేశారు. పిల్లల్లో నైపుణ్యం పెంచేందుకు మైక్రోసాఫ్ట్‌ వంటి కంపెనీలతో నైపుణ్య శిక్షణ ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నట్లు వివరించారు.

రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలి: సీఎం జగన్‌

ప్రతి పేద విద్యార్థి ఆర్థిక పరమైన కారణాలతో ఉన్నత చదువులకు దూరం కాకూడదనే లక్ష్యంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్రంలోని ప్రతి కుటుంబం నుంచి ఒక సత్య నాదెళ్ల రావాలని తాను కోరుకుంటున్నట్లు సీఎం జగన్‌ పేర్కొన్నారు. దీని కోసం విద్యార్థులు ప్రపంచ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకునేలా చదువుల్లో రాణించాలని సూచించారు. ప్రతిభ ఉన్న ప్రతి విద్యార్థికి తోడుగా ఉంటామని సీఎం జగన్ ఈ సందర్భంగా భరోసా ఇచ్చారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చదువులపై చేస్తున్న ఖర్చుతో రాష్ర్ట ఆర్థిక వ్యవస్థ మునిగిపోతోందంటూ కొందరు అసత్య ప్రచారం చేస్తున్నారని కానీ తాను మాత్రం విద్యార్థుల చదువుల కోసం చేస్తున్న ఖర్చును హ్యూమన్ క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ గా భావిస్తున్నానని ఇదే నా రాష్ర్టానికి భవిష్యత్తులో అండగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.

అదే రాష్ట్రం.. అదే బడ్జెట్ కానీ..

గత టీడీపీ ప్రభుత్వానికి ప్రస్తుత మన వైఎస్సార్ సీపీ ప్రభుత్వానికి అదే రాష్ట్రం.. అదే బడ్జెట్ ఉందని కానీ గత చంద్రబాబు పాలనలో ప్రభుత్వ ఖజానాను పెత్తందారులు దోచుకుంటే.. మన ప్రభుత్వంలో ఆ డబ్బును పేదల ఖాతాల్లోకి వేస్తూ వారికి భరోసా కల్పిస్తున్నట్లు సీఎం జగన్ వివరించారు. ఒక్క మీ జగన్‌ను ఎదుర్కొనేందుకు తోడేళ్లంతా ఏకమవుతున్నారని, మరో సారి రాష్ర్టంలో పెత్తందారీ ప్రభుత్వం తేవాలని తహతహలాడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికలు పేదవాడికి పెత్తందార్లకు మధ్య జరిగే క్లాస్‌ వార్‌ అని ఈ క్లాస్ వార్ లో తనకు పేద ప్రజలే అండ అని వ్యాఖ్యానించారు. గత పాలకులు గజదొంగల ముఠాగా ఏర్పడి అప్పట్లో రాష్ర్టాన్ని దోచుకున్నారని కానీ మన పేదల ప్రభుత్వంలో ఈ డబ్బు పేదల ఖాతాల్లోకి వెళుతుంటే ఓర్చుకోలేక కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఎల్లో మీడియా చంద్రబాబు అండ్ కో, దుష్టచతుష్టయం, గజ దొంగల ముఠా కుట్రలకు ఆజ్యం పోస్తోందని విమర్శించారు. గత ప్రభుత్వంలో జన్మభూమి కమిటీ పేరుతో ఎన్ని వేల కోట్లు తిన్నారో చంద్రబాబు చెప్పగలరా అని ప్రశ్నించారు. కానీ మన ప్రభుత్వం ఆ స్థానంలో లంచాలు, వివక్ష లేని సచివాలయ, వాలంటీర్ వ్యవస్థను తెచ్చి ప్రతి పథకాన్ని ప్రజల గడప వద్దకే చేరుస్తోందని సీఎం జగన్ వివరించారు. ఈ తేడా ప్రజలు ఎప్పుడు మరచిపోరాదని మన ప్రభుత్వంలో మంచి జరిగిందని భావించిన ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని కోరారు. మన ఇంట్లో ప్రస్తుత ప్రభుత్వం వల్ల ఎంత మంచి జరిగిందో అని మాత్రమే చూడాలన్నారు.

జగనన్న విద్యా దీవెన పూర్తి వివరాలు ఇవే..

జనవరి-మార్చి 2023 త్రైమాసికానికి 9.95 లక్షల మంది విద్యార్థులకు లబ్ధి చేకూరుస్తూ రూ.703 కోట్లను జమ చేశారు. ఇప్పటి వరకు 26,98,728 మంది విద్యార్థుల తల్లుల ఖాతాల్లో జగనన్న విద్యాదీవెన క్రింద జమ చేసిన ఆర్థిక సాయం రూ.10,636.67 కోట్లు. గత ప్రభుత్వం అరకొరగా ఇచ్చే ఫీజుల్లో సైతం బకాయిలు పెడుతూ 2017 సం॥ నుండి పెట్టిన బకాయిలు రూ.1,778 కోట్లతో కలిపి జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన క్రింద ఇప్పటి వరకు మన జగనన్న ప్రభుత్వం అందించిన మొత్తం సాయం రూ. 14,912.43 కోట్లు. జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటినుండి ఇప్పటి వరకు 47 నెలల కాలంలో విద్యారంగం మీద చేసిన ఖర్చు మొత్తం అక్షరాల రూ.59,331.22 కోట్లు.

‘జగనన్న విద్యా దీవెన’
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదవాలన్న సమున్నత లక్ష్యంతో.. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు చదివే పేద విద్యార్థులు కాలేజీలకు చెల్లించాల్సిన పూర్తి ఫీజుల మొత్తాన్ని క్రమం తప్పకుండా ఏ త్రైమాసికానికి ఆ త్రైమాసికం ముగిసిన వెంటనే కుటుంబంలో ఎంత మంది పిల్లలుంటే అంత మంది పిల్లలకు ఇచ్చేలా, వారి తల్లుల ఖాతాల్లో నేరుగా జమ చేస్తున్న రాష్ర్ట ప్రభుత్వం..

‘జగనన్న వసతి దీవెన’
ఉన్నత చదువులు చదివే పేద విద్యార్థులు భోజన, వసతి ఖర్చుల కోసం ఇబ్బంది పడకుండా ఏటా రెండు వాయిదాలలో ఐటీఐ విద్యార్థులకు రూ. 10 వేలు, పాలిటెక్నిక్ విద్యార్థులకు రూ.15 వేలు, డిగ్రీ, ఇంజినీరింగ్, మెడిసిన్ తదితర కోర్సులు అభ్యసించే వారికి రూ. 20 వేల చొప్పున ఆర్థిక సాయం.. కుటుంబంలో ఎంత మంది చదువుతుంటే అంత మందికీ.. వారి తల్లుల ఖాతాల్లో సంవత్సరానికి రెండు దఫాల్లో నేరుగా జమ చేస్తున్న రాష్ర్ట ప్రభుత్వం..

ఉన్నత విద్యకు ప్రోత్సాహం..
పేద విద్యార్థులు ఉన్నత విద్యను అభ్యసించేలా పూర్తి ఫీజు రీయింబర్స్ మెంట్ తో పాటు భోజన వసతి సౌకర్యాలకు వసతి దీవెన, కూడా ఆర్థిక సాయం అందిస్తూ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన..

జాబ్ ఓరియెంటెడ్ కరిక్యులమ్ తో ప్రస్తుత అవసరాలకు తగ్గట్లు కరిక్యులమ్ లో మార్పులు చేసి నాలుగేళ్ల ఆనర్స్ కోర్సులు.. విద్యార్థులలో నైపుణ్యాలను పెంచి వారు వెంటనే ఉపాధి పొందేలా 30 శాతం నైపుణ్యాభివృద్ధి కోర్సులు..

కరిక్యులమ్ లో భాగంగా ఆన్ లైన్ వర్టికల్స్.. దీనివల్ల విద్యార్థులు తాము చదువుతున్న కోర్సులతో పాటు తమకు అవసరమైన ఇతర నైపుణ్యాలు ఆన్ లైన్ లో నేర్చుకునే వెసులుబాటు..

కరిక్యులమ్ లో 10 నెలల కంపల్సరీ ఇంటర్న్ షిప్ పెట్టడం ద్వారా విద్యార్థులను పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా తీర్చిదిద్దుతున్న జగనన్న ప్రభుత్వం..

40 నైపుణ్యాలలో 1.62 లక్షల మంది విద్యార్థులకు శిక్షణ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ తో ఒప్పందం.. ఇప్పటికే 1.20 లక్షల మందికి మైక్రోసాఫ్ట్ టెక్నాలజీలో, అదే విధంగా Salesforceలో 33,000, AWSలో 23,000, Nasscomలో 20,000, Palo Altoలో 10,000, Alteryx Data Analyticsలో 7,000 మందికి శిక్షణ పూర్తిచేసి సర్టిఫికెట్స్ పంపిణీ.. దేశంలో ఒకే క్యాలెండర్ ఇయర్లో 2 లక్షల కంటే ఎక్కువ సర్టిఫికేషన్స్ సాధించిన ఏకైక రాష్ట్రం మనదే…

సత్ఫలితాలిస్తున్న విద్యా రంగ సంస్కరణలు
ఇంటర్ పాసై పై చదువులకు దూరమైన విద్యార్థుల సంఖ్య 2018-19లో 81,813 కాగా జగనన్న ప్రభుత్వం ప్రవేశపెట్టిన విద్యా దీవెన, వసతి దీవెన కారణంగా ఈ సంఖ్య గణనీయంగా తగ్గి 2022- 23 నాటికి కేవలం 22,387 కు చేరింది. 2022-23 నాటికి ఇంటర్ పాసై పై చదువులకు పోలేని విద్యార్థుల జాతీయ సగటు 27% కాగా, మన రాష్ట్రంలో ఇది కేవలం 6.62% మాత్రమే..

2018-19 సంవత్సరంలో 32.4 గా ఉన్న స్థూల నమోదు నిష్పత్తి (GER)..
రాబోయే రోజుల్లో GER శాతం 70కి తీసుకు వెళ్ళేలా చర్యలు.. 2018-19 లో సగటున ప్రతి 100 మంది బాలురకు 81 మంది బాలికలు కళాశాలల్లో చేరితే 2020-21 నాటికి ఈ సగటు 94కు పెరిగింది..
2018-19లో 37,000 గా ఉన్న క్యాంపస్ ప్లేస్ మెంట్స్ గణనీయంగా పెరిగి 2021-22 నాటికి 85,000 కు చేరడం విశేషం.. ఈ ఏడాదిలో ఇప్పటికే 80వేల మందికి ప్లేస్ మెంట్స్.. ఆగష్టులో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ముగిసేనాటికి ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం..

డిజిటల్ విద్య దిశగా అడుగులు..
8వ తరగతి విద్యార్థులకు బైజూస్ కంటెంట్ తో కూడిన ఉచిత ట్యాబ్లు.. నాడు – నేడు ద్వారా ఇప్పటికే అభివృద్ధి చేసిన పాఠశాలల్లో 6వ తరగతి పైన ప్రతి క్లాస్ రూమ్ లో ఉండేలా 30,213 ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్, 10,038 ఫౌండేషన్, ఫౌండేషన్ ప్లస్ స్కూళ్లలో స్మార్ట్ టీవీలు.. ప్రభుత్వ బడులు కార్పొరేట్ బడులతో పోటీపడటం కాదు, కార్పొరేట్ బడులే ప్రభుత్వ బడులతో పోటీపడాలి అన్న లక్ష్యంతో విద్యావ్యవస్థలో విప్లవాత్మక సంస్కరణలు ప్రవేశపెట్టిన జగనన్న ప్రభుత్వం.

Tags:Rs. 703 Crores of education grant funds in the accounts of mothers – the aim is that education does not stop due to poverty.

Post Midle