Natyam ad

మాజీ సర్పంచ్‌ కాంతమ్మ కు రూ:8.79 లక్షలు

— వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో లబ్దిపొందిన వైనం
— గడప గడపకూ మన ప్రభుత్వంలో బావుటా పుస్తకం పంపిణీ
— ఓట్లు వేయకపోయినా లబ్దిచేకూర్చిన ఘతన వైఎస్సార్‌సీపీదే

 

చౌడేపల్లె ముచ్చట్లు:

Post Midle

పరికిదొన మాజీ సర్పంచ్‌ వేలూరి కాంతమ్మ కుటుంభానికి వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాల ద్వారా మూడేళ్లలో రూ:8.79 లక్షల ఆదాయం సమకూరింది. బుధవారం పరికిదొన గ్రామంలో నిర్వహించిన గడప గడపకూ మనప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా కాంతమ్మ ఇంటికెళ్లి జెడ్పిటీసీ దామోదరరాజు, ఎంపీపీ రామమూర్తి , మంత్రి పిఏ ముని తుకారం ,బోయకొండ కమిటీ చైర్మన్‌ శంకర్‌నారాయణ, మాజీ ఎంపీపీ రుక్మిణమ్మ, తదితరులు కలిసి ప్రభుత్వ పథకాల అమలుపై ఆమెను అడిగితెలుసుకొన్నారు. ఈ ఉమ్మడి కుటుంభానికి వివిధ పథకాల ద్వారా రూ.8,97,865 రూపాయలు గ్రామంలో అత్యధికంగా లబ్దిపొందారని గుర్తించారు. ఇంత వెహోత్తంలో లబ్దిచేకూరడం ఆనందంగా ఉందని కాంతమ్మ తమ ఆనందాన్ని తెలిపింది. ఈ సంధర్భంగా జెడ్పిటీసీ, ఎంపీపీ లు మాట్లాడుతూ తమ ప్రభుత్వం ్యధికారంలోకి వచ్చినప్పటినుంచి రాజకీయాలకు అతీతంగా అర్హత బట్టి ప్రభుత్వ పథకాలు అందజేస్తున్నామనడానికి నిదర్శనం కాంతమ్మ కుటుంబమేనన్నారు. గత ప్రభుత్వాలు తమ పార్టీ వారికి మాత్రమే పథకాల్లో లబ్దిచేకూర్చే వారన్నారు.

 

 

మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్‌రెడ్డిల ఆదేశాల మేరకు తమ పార్టీకు ఓట్లు వేయనివారికి సైతం ప్రభుత్వ పథకాల్లో లబ్దిపొందారని గుర్తుచేశారు. అలాంటి పెద్దిరెడ్డి కుటుంబంపై టిడిపి నాయకులు పనిగట్టుకొని ఓర్వలేక అసత్య ఆరోపణలు చేయడం సమంజసం కాదని మండిపడ్డారు. ప్రజాధారణ ను చూసి ఓర్వలేక అనేక రకాలుగా రాద్దాంతం చేస్తున్నారని మండిపడ్డారు. టిడిపి నాయకుల పై కుట్రలు చేస్త్రూ పాలన సాగిస్తుంటే ఇంత అధిక వెహోత్తంలో కాంతమ్మ కుటుంభానికి ఎలా లబ్ది చేకూరుతుందని ప్రశ్నించారు. ఒక్కసారి ప్రజలు ఆలోచించాలని, ప్రజలకు అన్ని సేవలను సకాలంలో అందిస్తున్న జగనన్న ప్రభుత్వానికి జై కొట్టి పెద్దాయన కు అండగా నిలచి మంచి మెజార్టీ తో గెలిపింకుందామని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ లక్ష్మిదేవమ్మ, ఎంపీటీసీ శ్రీరాములు ఉప సర్పంచ్‌ చంద్రబాబు నాయుడు,మాజీ సర్పంచ్‌లు ,భాస్కర్‌, వెంకటరమణ, నేతలు చలపతినాయుడు ప్రకాష్‌, వెంకటరెడ్డి,మోహన్‌రెడ్డి, రామకృష్ణ,చిట్టి,గంగిరెడ్డి, శంకర,దేవిరెడ్డి, ఓబుల్‌రెడ్డి తదితరులున్నారు.

 

Tags: Rs: 8.79 lakhs to former Sarpanch Kanthamma

Post Midle

Leave A Reply

Your email address will not be published.