రూ. 2.97 కోట్లతో  ఆత్కూరు, ముత్యాలంపాడు, చెరువు మాధవరం ఎత్తిపోతల పథకం పనులు

-మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు
Date:17/02/2018
జి.కొండూరు ముచ్చట్లు:
అటవీ విస్తరణ లో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా నిలిచిందని ఇందుకు కారణమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని అందరం అభినందించాలి ఏపీ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పేర్కొన్నారు. 29 రాష్ట్రాల్లో అటవీ భూభాగంలో అత్యధికంగా మొక్కలు పెంచినందుకు ఆంధ్రప్రదేశ్ మొదటిస్థానం లో ఉందని మన పరిసరాల్లో కూడా ఒక్కొక్కరూ కనీసం 3 నుండి 5 మొక్కలు నాటాలని పిలుపునిచ్చారు.  శనివారం ఉదయం మండలంలోని ఆత్కూరు, వెంకటాపురం గ్రామాలకు సంబంధించిన (135+9) 148 ఇళ్ల పట్టాలను మంత్రి ఉమా పంపిణీకి చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రెడ్డిగూడెం మండలంలో 412,  మైలవరంలో 1655 జి.కొండూరు లో 2309, ఇబ్రహీంపట్నంలో 2745 పట్టాలు వెరసి  6697 సిద్ధం చేసినట్లు  ఇంకా విజయవాడ రూరల్ మండలంతో కలిపి సుమారు 10 వేల పట్టాలి పంపిణీ చేస్తున్నట్లు తెలిపారు. ఒక్కో ఇంటి పట్టా ఖరీదు 5 లక్షల నుండి 10 లక్షల ఖరీదు చేస్తుందని, ఇంత విలువైన స్థలాలు దశాబ్దాలుగా మీకు రాలేదని మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లగానే అన్ని రెగ్యులరైజ్ చేసి ఇవ్వమని స్పష్టం చేసారని తెలిపారు.రూ. 2.97 కోట్ల తో చెరువు మాధవరం గ్రంధివాని చెరువుకు ఆత్కూరు హెచ్. ముత్యాలంపాడు గ్రామాల్లోని రెండు ఊరు చెరువు, అక్కుల చెరువు, సావరాల చెరువుల కింద 1066 ఎకరాలు పూర్తి సాగు లోకి తెచ్చి రైతులను ఆదుకుంటామని తెలిపారు.
Tags; Rs. Athurugu, pearl paralyzed, 2.01 crores, pond discoloration schemes

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *