Natyam ad

ఆర్టిఏ అధికారుల చోద్యం-దళారులదే రాజ్యం

వరంగల్ ముచ్చట్లు:

రోడ్డు రవాణా సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారుల నిర్లక్ష్యం మూలంగా ఆ కార్యాలయంలో దళారుల రాజ్యం నడుస్తుందని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఆర్టిఏ కార్యాలయానికి వెళ్లి తమకు చెందిన వాహనాలను రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే జడుచుకునే పరిస్థితి ఏర్పడిందని అంటున్నారు. వరంగల్ హనుమకొండ జిల్లాలకు చెందిన కార్యాలయాలు వరంగల్ సమీపంలోని నాయుడు పంపు వద్ద ఉన్నాయి. హనుమకొండ జిల్లాలోని మండలాల నుండి ప్రజలు తమ వాహనాలను అక్కడికి తీసుకువెళ్లి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం తలకు మించిన భారంగా మారిందని వాపోతున్నారు. సుమారు 50 నుండి 70 కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి కార్యాలయానికి వెళ్ళవలసి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో వాహనదారులు తమ వాహనాలను రిజిస్ట్రేషన్,ఫిట్నెస్,ఇన్సూరెన్స్ తో పాటు మరెన్నో రకాల సేవలను పొందాలంటే ఆర్టిఏ అధికారులు నేరుగా దళారులను సంప్రదించాలని చెప్పడం ఇక్కడ పరిపాటిగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాని మూలంగా జేబులు ఖాళీ అవడమే జరుగుతుందని తమకు వచ్చిన ఫలితం ఏమీ లేదని అంటున్నారు. అంత దూరం ప్రయాణం చేసి ఆర్టిఏ కార్యాలయానికి రావడం ఇబ్బందికరంగా మారడమే కాకుండా దళారులు అడిగినంత ఇచ్చి సేవలు పెంచడం జరుగుతుందని బహిరంగంగా ఆరోపిస్తున్నారు.

 

 

 

ఈ కార్యాలయాలలో పనిచేస్తున్న అధికారులు పూర్తిగా దళారుల మీదనే ఆధారపడడం వాహనదారులకు తీవ్రమైన తలనొప్పిగా మారిందని అనుకుంటున్నారు.వరంగల్, హనుమకొండ జిల్లాలలోని ప్రజలు కొత్త వాహనాలను కొని డ్రైవింగ్ లైసెన్స్, రిజిస్ట్రేషన్, వాహనాల టాక్సీ లాంటివి చెల్లించడం వంటి మొదలైన ఆర్టిఏ అందిస్తున్న అన్ని రకాల సేవలు పొందాలంటే దళారుల వద్దకు వెళ్లవలసిన దుస్థితి ఏర్పడిందని అంటున్నారు. అలాంటప్పుడు ఆర్టిఏ కార్యాలయంలో పనిచేస్తున్న అధికారులు ఏం చేస్తున్నట్టని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నూతన వాహనాలను కొనడం మొదలు వాటిని రోడ్డు మీద నడిపించే వరకు ఆర్టిఏ అధికారుల పాత్ర ఎంతో ఉంటుంది వారు తమ పనులకు ఎగనామం పెట్టి సొంత పనులు చూసుకోవడం వెనుక అసలు కారణాలు వేరే ఉన్నాయని ప్రజలు చర్చించుకుంటున్నారు. కార్యాలయంలో అధికారులు ఉన్నప్పటికీ పనులు చేసేది మాత్రం దళారులేనని బహిరంగంగానే విమర్శలు ఉన్నాయి.

 

 

 

Post Midle

ఈ రెండు కార్యాలయాలలో పనిచేస్తున్న ఆర్టిఏ అధికారులు కిందిస్థాయి సిబ్బంది మీద పనుల భారం వేసి తమ విధులకు ఎగనామం పెడతారని ప్రజలు చర్చించుకుంటున్నారు. రోడ్డు మీద వాహనాలను నడిపేటప్పుడు వారు తీసుకోవలసిన జాగ్రత్తలు పాటించవలసిన నియమ నిబంధనలు వాహనదారులకు తెలవకుండా పోవడం వెనుక ఆర్టిఏ అధికారుల నిర్లక్ష్యం ఎంతో ఉందని వాహనదారులు అంటున్నారు. మామూలు తీసుకొని దళారులు తమ వాహనాలను రిజిస్ట్రేషన్ చేయడంతో పాటు డ్రైవింగ్ లైసెన్స్ ఇన్సూరెన్స్ ఫిట్నెస్ ట్యాక్సీ చెల్లించడం లాంటిది ఎన్నో పనులు దళారులు చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. దాని మూలంగా వాహనదారులకు రోడ్డు భద్రత నియమాలు తెలవక ప్రమాదాలకు కారకులు కావాల్సి వస్తుందని అంటున్నారు. కార్యాలయంలో సరిపడా సిబ్బంది ఉన్నప్పటికీ వారితో పై స్థాయి అధికారులు పనిచేయించుకోకపోవడం వెనుక అసలుమతులకు వేరే ఉందని వాహనదారులు అంటున్నారు. ఆర్టిఏ కార్యాలయానికి వచ్చిందంటే జేబులు గుల్ల చేసుకుని వెళ్ళవలసిన పరిస్థితి దాపురించిందని ఆవేదన చెందుతున్నారు.ఒక్కో పనికి ఒక్కో రేటు చొప్పున దళారులు డబ్బులు వసూలు చేయడంతో జేబులు ఖాళీ అవుతున్నాయని అంటున్నారు.

 

 

దళారులు తమ వద్ద నుండి వసూలు చేసిన డబ్బుల్లో కొంత భాగం అధికారులకు చెల్లించడం జరుగుతుందని దాని మూలంగానే అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని అనుకుంటున్నారు. హనుమకొండ జిల్లాకు చెందిన కార్యాలయాన్ని చింతగట్టు సమీపంలోనికి మార్చాలని గతంలో ప్రతిపాదనలు చేసిన అధికారులు పట్టించుకోవడం లేదని, ఇప్పటికైనా మారిన జిల్లా పరిస్థితులకు అనుగుణంగా ఆర్టీఏ కార్యాలయాలను ఏర్పాటు చేసి వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. వరంగల్ హనుమకొండ రోడ్ రవాణా సంస్థ కార్యాలయంలో పనిచేస్తున్న ఆర్టిఏ అధికారుల పైన అనేక రకాల ఆవరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో వీరిపై వచ్చిన ఆరోపణలే పదేపదే రావడం ఆర్థికపరమైన అంశాలే ప్రధానంగా ఉండి ఉంటాయని ప్రజలు చర్చించుకుంటున్నారు.

 

Tags: RTA officers are the kingdom of Chodyam-Dalaru

Post Midle