ఆర్టీసీ బస్సు చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం

RTC bus accident

RTC bus accident

Date:16/09/2018

నాగర్ కర్నూల్ ముచ్చట్లు:

ఓ ఆర్టీసీ బస్సు కు ముందున్న చక్రాలు ఊడిపోవడంతో ప్రమాదం సంభవించింది. అయితే ఎలాంటి ప్రాణ నష్టం జరుగలేదు. పరిమితికి మించి ప్రయాణికులతో వెళ్తున్న బస్సులో సుమారు ౧౦౦ మంది ప్రయాణికులున్నారు. బిజినేపల్లె మండలం వట్టెం గ్రామం సమీపంలో ఈ ప్రమాదం సంభవించింది.

 

అధిక సంఖ్యలో ప్రయాణికులు బస్సులోకి ఎక్కడంతో టైరు పగిలి ఒకపైపుకునకు లాగడంతో ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి వనపర్తి కి వెళుతుండగా ఘటన జరిగింది.

 

ఇందులో విఆర్వో పరీక్ష కు హాజరయ్యే అభ్యర్థులు ౧౫ మంది స్వల్పంగా గాయపడ్డారు. వీరిని నాగర్ కర్నూల్ ఏరియా ఆసుపత్రికి తరలించారు.

 

గెలుపే ధ్యేయంగా పనిచేయాలి

Tags:RTC bus accident

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *