పుంగనూరు నుంచి తిరువణామలైకు ఆర్టీసి బస్సు ప్రారంభం
పుంగనూరు ముచ్చట్లు:
తమిళనాడులోని తిరువణామలై ఆలయానికి ప్రతి పున్నమికి ఆర్టీసి బస్సులు పుంగనూరు నుంచి నడుపుతున్నట్లు డిపోమేనేజర్ ఆర్సి.నిరంజన్ తెలిపారు. సోమవారం స్థానిక బస్టాండులో మదనపల్లె డిపో మేనేజర్ బస్సుకు పూజలు చేసి భక్తులతో ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రజలు వేలాది మంది తిరువణామలైలోని గిరి ప్రదక్షణానికి వెళ్తారని తెలిపారు. దీనిని దృష్టిలో ఉంచుకుని అల్ట్రాడిలెక్స్ బస్సు రానుపోను చార్జీలు రూ.790లు గా నిర్ణయించినట్లు తెలిపారు. ప్రజలు బస్సులను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ రమణ, తదితరులు పాల్గొన్నారు.

Tags: RTC bus from Punganur to Tiruvannamalai started
