అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
బస్సు షెల్టర్ ను ఢీకొని ఆగిన వైనం
ప్రయాణికులు క్షేమం
బుట్టాయిగూడెం ముచ్చట్లు:

ఏలూరు జిల్లా బుట్టాయిగూడెం శివాలయం వద్ద బస్సు షెల్టర్ లోకి ఆర్టీసీ బస్సు దూసుకెళ్లింది. జంగారెడ్డిగూడెం నుండి దొరమామిడి వెళుతున్న ఆర్టీసీ బస్సు ఒకసారిగా బ్రేక్ ఫెయిల్ అవ్వడంతో డ్రైవర్ అప్రమత్తమైయాడు. బస్సును ప్రమాదం జరగకుండా మరోవైపుకు మళ్ళించడంతో బస్సు షెల్టర్ తగిలి బస్యసు ఆగిపోయింది. దాంతో ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. అదే బస్సు వేరే వైపుకి వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని డ్రైవర్ అప్రమత్తమయ్యి బస్సును ఇటు పైపుకు మళ్లించడంతో ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనలో ఎవరికి ఎటువంటి ప్రమాదం జరగలేదు. జంగారెడ్డిగూడెం ఆర్టీసీ డిపో నుండి వెళ్లే ప్రతి బస్సు ఫిట్నెస్ లేకపోవడమే ప్రమాదాలు, జరుగుతున్నాయని పలువురు ఆరోపిస్తున్నారు.
Tags: RTC bus out of control
