పుంగనూరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసి బస్సులు-ట్రాఫిక్‌ మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

 

 

పుంగనూరు డిపో నుంచి అన్ని గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీసి బస్సులు నడుపనున్నట్లు ట్రాఫిక్‌ మేనేజర్‌ భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం ఆయన డిపోలో బస్సు రూట్‌లపై వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, కమిషనర్‌ కెఎల్‌.వర్మ, మంత్రి పిఏ మునితుకారాం, మండల అభివృద్ధి కమిటి చైర్మన్‌ భాస్కర్‌రెడ్డి, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి తో చర్చలు జరిపారు. గ్రామీణ ప్రాంతాలకు అవసరమైన అదనపు సర్వీసులను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు నడుపుతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి మజ్దూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, మాజీ ఎంపీపీ అంజిబాబు , డిపో మేనేజర్‌ సుధాకరయ్య , మాజీ మండల వైస్‌ రామచంద్రారెడ్డి, సర్పంచ్‌ సుబ్బారెడ్డి పాల్గొన్నారు.

 

పుంగనూరులో పనిచేస్తున్న మాదవరాజుకు తహశీల్ధార్‌గా పదోన్నతి

Tags: RTC Buses-Traffic Manager Bhaskar Reddy from Punganur to rural areas

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *