బస్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగుల సంబరాలు
ఖమ్మం ముచ్చట్లు:
టిఎస్.ఆర్.టి.సి బస్ డిపో ముందు ఆర్టీసీ ఉద్యోగులు సంబరాలు జరుపుకున్నారు. ఆర్టీసీ సంస్థలలో పనిచేస్తున్న 44 వేలమందిని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకోవడం పట్ల సీఎం కేసీఆర్ కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం కేసీఆర్, మంత్రి పువ్వాడ చిత్రపటానికి పాలాభిషేకం చేసారు. బాంబులు పేల్చి, స్వీట్లు పంచుకున్నారు. ఈ వేడుకల్లో ఆర్టీసీ ఉద్యోగులు పెద్దఎత్తున పాల్గొన్నారు.
Tags: RTC employees celebrating in front of the bus depot

