పుంగనూరు నుంచి తిరుపతికి ఆర్టీసి

RTC from Punganur to Tirupati

RTC from Punganur to Tirupati

– మంత్రి పెద్దిరెడ్డి ఆదేశం

Date:20/09/2019

పుంగనూరు ముచ్చట్లు:

పుంగనూరు నుంచి తిరుపతికి ప్రతి రోజు నాలుగు ట్రిలు ఎల్‌ఎస్‌ఎస్‌ బస్సును సాయంత్రం ఎంపి రెడ్డెప్ప ప్రారంబించారు. శుక్రవారం ఎంపి రెడ్డెప్ప, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, మాజీ జెడ్పిటిసి వెంకటరెడ్డి యాదవ్‌, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇఫ్తికార్‌, బూత్‌ కమిటి మేనేజర్‌ అమ్ము కలసి పూజలు చేసి, బస్సులో ప్రయాణించారు. ఈ సందర్భంగా ఎంపి రెడ్డెప్ప మాట్లాడుతూ రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశాల మేరకు ప్రతి రోజు ఉదయం నుంచి రాత్రి దాక తిరుపతికి నాలుగు ట్రిలు ఆర్టీసి బస్సును పలమనేరు డిపో వారు నడుపుతారన్నారు. ఉదయం 4:30 గంటలకు పుంగనూరు నుంచి బయలుదేరుతుందన్నారు. అలాగే సాయంత్రం 4:30 గంటలకు బయలుదేరి తిరుపతికి వెళ్లి తిరిగి రాత్రి పుంగనూరు చేరుతుందన్నారు. ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిఎం రామకృష్ణ, అసిస్టెంట్‌ మేనేజర్‌ దినేష్‌, పార్టీ నేతలు అమరనాథరెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, నాగభూణ్‌రెడ్డి, కిజర్‌ఖాన్‌, చెంగారెడ్డి, జయరాం తదితరులు పాల్గొన్నారు.

సేవా సప్తాహంలో సదా ఆచరిస్తాం

Tags: RTC from Punganur to Tirupati

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *