Natyam ad

మారుమూల గ్రామాలకు ఆర్టీసీ సేవలు- ఎమ్మెల్యే ద్వారకనాథరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ ప్రభుత్వంలో మారుమూల గ్రామాలకు సైతం ఆర్టీసి బస్సులను నడుపుతున్నట్లు తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తెలిపారు. సోమవారం వైఎస్సార్‌ మజ్ధూర్‌ ఆర్టీసిఅధ్యక్షుడు జయరామిరెడ్డి , డిపో మేనేజర్‌ సుధాకరయ్య ఆధ్వర్యంలో పుంగనూరు నుంచి యల్లారుబైలు, కాటిపేరి గ్రామాలకు నూతన ఆర్టీసి సర్వీసును ఎమ్మెల్యే ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ 30 సంవత్సరాలుగా ప్రారంభానికి నోచుకోని ఆర్టీసి డిపోను మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అధికారంలోకి రాగానే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామి మేరకు డిపోను ప్రారంభించడం జరిగిందన్నారు. ప్రతి గ్రామానికి ఆర్టీసి సేవలు అందిస్తామని తెలిపారు. ప్రజలందరు ఆర్టీసిలో సురక్షిత ప్రాయాణం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ చైర్మన్‌ అలీమ్‌బాషా, రాష్ట్ర జానపద కళల సంస్థ చైర్మన్‌ కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, పీకెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ జిల్లా కార్యదర్శి ఫకృద్ధిన్‌షరీఫ్‌, ఆర్టీసి సంఘ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags: RTC services to remote villages – MLA Dwarkanatha Reddy

Post Midle