Natyam ad

సరుకులను సకాలంలో ఇవ్వడంలో ఆర్టీసి ముందంజలో ఉండాలి -జితేంద్రనాథ్‌రెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

ప్రజల సరుకులను ఆర్టీసి కార్గో సర్వీసుల ద్వారా ఎప్పటికప్పుడు అందించడంలో ఆర్టీసి ముందంజలో నిలవాలని జిల్లా ఆర్టీసి రవాణాశాఖాధికారి టి.జితేంద్రనాథ్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక డిపో మేనేజర్‌ సుధాకరయ్యతో కలసి డోర్‌ డెలివరీ ప్రచార మాసోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ కార్గో సర్వీసులను మరింత బలోపేతం చేయాలన్నారు. డోర్‌ డెలివరీ పథకాన్ని వ్యాపారస్తులకు, దుకాణాదారులకు, ప్రజలకు తెలియజేసి సకాలంలో డెలివరీ ఆర్టీసిలోనే సాధ్యం అనే విషయాన్ని సిబ్బంది రుజువు చేయాలని కోరారు. అలాగే సిబ్బంది ఆయిల్‌ ఖర్చులను తగ్గించాలని, ఆదాయాన్ని పెంపొందించాలని సూచించారు. సురక్షిత ప్రయాణం ఆర్టీసి అన్న నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ఈ కార్యక్రమంలో గ్యారేజ్‌ సూపర్‌వైజర్‌ రాధారాకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు.

Post Midle

Tags: RTC should be at the forefront in delivering goods on time – Jitendranath Reddy

Post Midle